+91 95819 05907

శాంతి భద్రతలకు విగాధం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం –ఏసిపి. సాంబరాజు

శాంతి భద్రతలకు విగాధం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం –ఏసిపి. సాంబరాజు

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :

చింతకాని మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామంలో కాంగ్రెస్. బిఆర్ఎస్.ఇరు పార్టీల వారిని గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా వారికి అవగాహన కార్యక్రమం స్థానిక ఎస్సై వీరేందర్ ఆధ్వర్యంలో ఎసిపి సాంబరాజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ*జిల్లా పోలీస్ సిపి సునీల్ దత్.ఆదేశాల అనుసారం.గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సెక్షన్ 163 డిఎన్ఎస్ఎస్. యాక్ట్ అమలు: ఉంటుందని

ఈ నెల 11 నుండి నిర్వహించనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని మొదటి విడత పోలింగ్ జరిగే, ప్రాంతాలు. అలాగే.చింతకాని.బోనకల్లు, , మండలలో సెక్షన్ 163 బి ఎన్ ఎస్ ఎస్ యాక్ట్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అని వారు తెలియజేశారు

ది.09.12.2025 సాయంత్రం 5:00 గంటల నుండి ది. 11.12.2025 న ఓట్ల లెక్కింపు మరియు ఫలితాలు ప్రకటించే వరకు అంక్షాలు అమలులో వుంటాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఐదుగురు కంటే ఎక్కువ మంది గుంపులుగా ఉండరాదని పెర్కొన్నారు. అదేవిధంగా ఎవరూ రెచ్చగొట్టేవిధంగా వ్యాఖ్యలు చేయడం, కవ్వింపు చర్యలకు పాల్పడటం చేయరాదని సూచించారు. ఎవరైనా ఎన్నికల నియమాలను ఉల్లంఘించినా/అతిక్రమించినా, చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఎక్కడైనా డబ్బు, మద్యం ఉచిత కానుకల ద్వారా ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడంతో పాటు ఓటర్లను భయబ్రాంతులకు గురి చేయకూడదని తెలిపారు.

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను సిద్ధం చేశామన్నారు. ఎన్నికలలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సెక్షన్ 163 BNSS యాక్ట్ అమలు చేస్తున్నట్లు తెలిపారు.

ఎన్నికల నియమ నిబంధనలు పాటిస్తూ… పారదర్శక ఎన్నికల నిర్వహణకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని అన్నారు.పోలింగ్ సందర్భంగా ఓటర్లకు భద్రత రీత్యా ఎలాంటి సమస్యలు ఎదురైన డయల్ 100కి ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు.

*1. ఐదుగురు కంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమికూడటం, ఊరేగింపులు చేయడం నిషేధం.*

*2. పోలింగ్‌ కేంద్రాలకు కిలోమీటర్‌ దూరం వరకు ఆత్మరక్షణ పేరుతో కర్రలు, తుపాకులు,మారణాయుధాలతో సంచరించడం నిషేధం.*

*3. బహిరంగ ప్రదేశాల్లో షామియానాలు, పందిళ్లు వంటి తాత్కాలిక నిర్మాణాలు చేపట్టడానికి అనుమతి లేదు.*

*4. ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆంక్షల సమయంలో మైకులు, స్పీకర్ల ద్వారా పాటలు పెట్టడం, ప్రజలను ఉద్దేశించి ప్రసంగాలు చేయడం నిషిద్ధం*.

*5 . వ్యక్తులు, వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్లకార్డులు, చిత్రాలు, గుర్తులు ప్రదర్శించడం, చట్టబద్ధమైన అధికారానికి భంగం కలిగించే లేదా ధిక్కరించే నేరానికి దారితీసే అవకాశం ఉన్న ఏదైనా ప్రసంగం నిషేధం.*గ్రామ ప్రజలందరూ పోలీసు వారికి సహకరించి ఎన్నికలుప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎస్సై వీరేందర్. పోలీస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్. .వెంకటేశ్వర్లు. కానిస్టేబుల్స్. అశోక్. వెంకటి.పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !