మల్కారంలో మెచ్చు లలిత ప్రచారం: “ఆదర్శవంతమైన పంచాయతీ నా లక్ష్యం”
-నా గ్రామ పంచాయతీ మండలంలో ఆదర్శంగా ఉండాలి -లలిత
నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) డిసెంబర్, 05: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం, మల్కారం గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల బరిలో సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డ బిఆర్ఎస్ మరియు టిడిపి బలపరిచిన మెచ్చు లలిత తన ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఆమె ‘బ్రేకులు లేని బుల్డోజర్’ దూకుడుతో ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మెచ్చు లలిత మాట్లాడుతూ… “నన్ను గెలిపిస్తే, మన గ్రామ పంచాయతీని మండలంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాను. మీ ఇంటి ఆడబిడ్డగా మీ వద్దకు వచ్చాను. నన్ను ఆదుకోండి. మన పంచాయతీ అభివృద్ధిని పరుగులు పెట్టిద్దాం,” అని ఓటర్లను ఉద్దేశించి విజ్ఞప్తి చేశారు. లలిత ఇచ్చిన హామీలు, ఆమె ప్రచార తీరు స్థానికులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ప్రచార కార్యక్రమంలో స్థానిక బిఆర్ఎస్ మరియు టిడిపి పార్టీల ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.









