అంబేద్కర్ జీవితం అందరికీ ఆదర్శనీయం.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
డిసిసి అధ్యక్షులు
నూతి సత్యనారాయణ
బి.ఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం మరియు బహుజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ పాల్గొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా నూతి సత్యనారాయణ మాట్లాడుతూ అంబేద్కర్ జీవితం అందరికీ ఆదర్శనీయమని పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రాజ్యాంగ పరిరక్షణకు బీసీల రిజర్వేషన్ల అమలుకై కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నదని తెలియజేశారు అంబేద్కర్ ఆశయాల సాధనకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బిఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం అధ్యక్షులు లింగాల రవికుమార్ బహుజన కులాల సమన్వయకర్త కత్తి నెహ్రూ గౌడ్ మహాత్మ జ్యోతిరావు పూలే సంఘ అధ్యక్షులు పెళ్లూరు విజయకుమార్ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు కొరిపల్లి శ్రీనివాస్ పలు సంఘాల నేతలు పాల్గొన్నారు









