+91 95819 05907

తెలంగాణ కేటాయించిన “కంపా” నిధుల వివరాలేంటి?

* అడవుల పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ అటవీకరణ కోసం తీసుకున్న చర్యలు ఏంటి..?
* లోక్ సభలో ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి
* రూ. 3,852 కోట్లు వెచ్చించినట్లు తెలిపిన కేంద్ర అటవీ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్.

నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.

న్యూ ఢిల్లీ: సాగునీరు, విద్యుత్ సహా వివిధ రకాల ప్రాజెక్టుల కోసం తీసుకునే అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా ఇచ్చే భూముల్లో అడవుల పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ అటవీకరణ కోసం కాంపెన్సేటరీ అఫారేస్టేషన్ మేనేజ్మెంట్ ప్లానింగ్ అథారిటీ (కంపా) నిధులను తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటివరకు ఎన్ని కేటాయించారని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి లోక్ సభలో ప్రశ్నించారు. అడవుల పునరుద్ధరణ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాల్సిందిగా కోరారు. దీనికి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖల సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
ఇప్పటివరకు రూ.3,852 కోట్ల కేటాయింపు
కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు కేటాయించే అటవీకరణ నిర్వహణ మరియు ప్రణాళిక అథారిటీ ( కంపా) నిధుల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటివరకు మొత్తం రూ. 3,852.61 కోట్లు అందించినట్లు కేంద్ర అటవీ శాఖ సహాయ మంత్రి తెలిపారు. క్షీణించిన అడవుల పునరుద్ధరణ, వన్యప్రాణుల ఆవాసాల మెరుగుదల, జీవవైవిధ్యాన్ని కాపాడే కార్యకలాపాలకు వీటిని కేటాయించాలనేది లక్ష్యం.
సీఏఎఫ్ చట్టం ద్వారా ఇలా..
పరిహార అటవీకరణ నిధి ( సిఏఎఫ్) చట్టం -2016 ద్వారా రాష్ట్ర నిధుల వినియోగం కోసం వార్షిక కార్యకలాపాల ప్రణాళిక(ఏపి ఓఎస్) రూపొందించినట్లు కేంద్ర సహాయ మంత్రి పేర్కొన్నారు. 2018 లో జత చేసిన నిబంధనల ప్రకారం కంపా నిధుల నుంచి రాష్ట్ర అటవీ శాఖకు పరిహార ఫండ్ కచ్చితంగా లభిస్తుందని వివరించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !