ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్
నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :
ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ అన్నారు. చింతకాని మండలం పాతర్లపాడు గ్రామం ఎన్నికలలో సర్పంచ్ గా పోటీ చేస్తున్న అభ్యర్థులకు స్థానిక ప్రజలకు, రాజకీయ నాయకులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
సమావేశంలో ఏసీపీ మాట్లాడుతూ అభ్యర్థులందరూ సామరస్య పూర్వకంగా ఎన్నికల నిర్వహణకు సహకారం అందించాలని కోరారు. ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురిచేయవద్దని విజ్ఞప్తి చేశారు. నియమ నిబంధనలు పాటించకపోతే కేసులు సైతం నమోదు అవుతాయని తెలిపారు. అభ్యర్థులందరూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలకు జరుపుకోవాలని, ఎక్కడ కూడా శాంతిభద్రతల సమస్య రాకుండా పోలీసులు సూచించిన సమయంలోనే సమావేశాలు, ర్యాలీలు నిర్వహించి పోలీసులకు సహకరించాలని కోరారు.
ముఖ్యంగా ఎన్నికలు, ఫలితాల అనంతరం ఎలాంటి ర్యాలీలు గాని సమావేశాలకు గాని అనుమతి లేదని, ఇది గమనించి అందరూ సహకరించాలని అన్నారు.
సమావేశంలో ఏసీపీ సాంబరాజు, సిఐ వెంకటప్రసాద్,
ఎస్సై తదితరులు పాల్గొన్నారు.









