+91 95819 05907

ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవాలి :డిఎస్పీ

ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవాలి.
*అసాంఘిక కార్యకలపలు,గొడవలు సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు*
*మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి*
నేటి గదర్ కరకగూడెం: ఈనెల 11వ తారీఖున జరుగుతున్న సర్పంచ్ ఎన్నికలలో భాగంగా వివిధ పార్టీల అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలు ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవాలని మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు సూచించారు.కరకగూడెం గ్రామపంచాయతీ కార్యాలయంలో వివిధ పార్టీలకు సంబంధించిన సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి,ఏడుళ్ళ బయ్యారం సిఐ వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ 11వ తారీఖున జరిగే గ్రామపంచాయతీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని అనవసరంగా గొడవలు పెట్టుకొని ఒకరినొకరు దూషించుకోవడం లాంటివి చేయకూడదని అలా చేసినట్లయితే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఎన్నికల ముగిసిన అనంతరం ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు చేయకూడదని, పోటీ చేసే అభ్యర్థులు ఓటర్లను బెదిరింపులు కాని, ప్రలోభాలు పెట్టిన కానీ చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలింగ్ కేంద్రాల వద్ద, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద అల్లరి సృష్టించడానికి ప్రయత్నిస్తే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కరకగూడెం ఎస్ఐ పివి నాగేశ్వరరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !