+91 95819 05907

పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్ : అడిషనల్ డీసీపీ (అడ్మిన్) రామానుజం.

పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్ : అడిషనల్ డీసీపీ (అడ్మిన్) రామానుజం.

నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.

శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు, ప్రజల భద్రతకు భరోసా కల్పించేలా ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నట్లు అడిషనల్ డీసీపీ అడ్మిన్ రామానుజం తెలిపారు.

పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా స్ధానిక పోలీసు బలగాలతో చింతకాని మండలం రామకృష్టపురం, పాతర్లపాడు గ్రామంలో బుధవారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ…గ్రామ పంచాయతీ ఎన్నికలు నేపథ్యంలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు సాగేలా అవసరమైన ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే నాకా బందీ నిర్వహించిన పోలీసులు.. కీలక పాయింట్లపై నిఘా పెట్టి తనిఖీలు ముమ్మరం చేస్తున్నారని అన్నారు.

ముందస్తు ప్రణాళికతో క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో కట్టుదిట్టమైన బందోబస్తుకు అవసరమైన సన్నాహాలు చేపట్టినట్లు తెలిపారు. అందులో భాగంగానే పోలీసు సిబ్బంది అనేక ప్రాంతాల్లో వీధుల్లో తిరుగుతూ.. ప్రజల భద్రతకు భరోసా కల్పిస్తూనే..ఎన్నికలను ప్రశాంతయుతంగా నిర్వహించేందుకు ప్రజలందరూ సహకరించాలని, అసాంఘిక శక్తులకు సహకరించ వద్దని కోరుతున్నామని అన్నారు.

ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను పాటిస్తూ ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా నచ్చిన వ్యక్తికి, ఓటువేసే ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించేందుకు పోలీస్ యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని పెర్కొన్నారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించడం ప్రశాంత వాతావరణాన్ని భంగం కలిగించే నేరచరితులను బైండోవర్ చేశామని తెలిపారు. అక్రమ మధ్యం, నగదు, కానుకల రవాణాను చెక్ పెట్టేందుకు చెక్ పోస్టుల ద్వారా నియంత్రించే చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నిర్భయంగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా పోలీస్ పెట్రోలింగ్ వాహనాలు ,బ్లూకోల్డ్ బృందాలు నిరంతరం ప్రజలకు అందుబాటులో వుంటూ విధులు నిర్వహిస్తున్నట్లు పెర్కొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !