+91 95819 05907

ఖమ్మం జిల్లా టి.డబ్ల్యూ.జే.ఎఫ్ అడ్‌హాక్ కమిటీ ఏర్పాటు. – ఫెడరేషన్ జిల్లా కన్వీనర్‌గా టి.ఎస్. చక్రవర్తి

ఖమ్మం జిల్లా టి.డబ్ల్యూ.జే.ఎఫ్ అడ్‌హాక్ కమిటీ ఏర్పాటు.

– ఫెడరేషన్ జిల్లా కన్వీనర్‌గా టి.ఎస్. చక్రవర్తి

నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టి.డబ్ల్యూ.జే.ఎఫ్) ఖమ్మం జిల్లా అడ్‌హాక్ కమిటీని రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య అధికారికంగా ప్రకటించారు. సోమవారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని కోణార్క్ హోటల్‌లో నిర్వహించిన ఫెడరేషన్ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు పులిపలుపుల ఆనందం, వల్లాల జగన్, సీనియర్ జర్నలిస్ట్ ఎం.డి. సాదిక్ పాషా తదితరుల సమక్షంలో కమిటీ ఎన్నిక కాగా, ఈ కమిటీని ప్రకటించారు.

ఖమ్మం జిల్లా అడ్‌హాక్ కమిటీ కన్వీనర్‌గా టి. సంతోష్ చక్రవర్తి, కో–కన్వీనర్లుగా అర్వపల్లి నగేష్, అంతోటి శ్రీనివాస్, నానబాల రామకృష్ణ, వందనపు సామ్రాట్ లను నియమించినట్లు తెలిపారు. ఈ కమిటీ రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ కో–కన్వీనర్లు వల్లాల జగన్, జి. వెంకటేశ్వర్లు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బి. గోపాల్, పాల్వాయి జానయ్య, సీనియర్ జర్నలిస్ట్ సాదిక్ పాషా సహకారంతో జిల్లా స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తుందని వెల్లడించారు.

జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ఏర్పడిందని మామిడి సోమయ్య తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ కార్మిక శాఖ గుర్తింపు పొందిన తొలి జర్నలిస్టుల ట్రేడ్ యూనియన్ కూడా టి.డబ్ల్యూ. జే. ఎఫ్ నేనని అని ఆయన గుర్తు చేశారు.

ఫెడరేషన్ ఏ రాజకీయ పార్టీకి గానీ, ఏ ఒక్క పత్రికకు గానీ అనుబంధ సంఘం కాదని, పూర్తిస్థాయి స్వతంత్రంగా జర్నలిస్టుల పక్షాన పనిచేసే స్వతంత్ర సంఘమని ఆయన స్పష్టం చేశారు. కొంతమంది కావాలని ఈ సంఘాన్ని పార్టీ సంఘం లేదా పత్రిక సంఘంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను జర్నలిస్టులు ఎవ్వరూ నమ్మవద్దని ఆయన కోరారు.జర్నలిస్టుల సమస్యలపై ధైర్యంగా పోరాడే వేదికగా టి.డబ్ల్యూ.జే.ఎఫ్ నిలుస్తుందని తెలిపారు.

ఖమ్మం జిల్లా ఫెడరేషన్‌లో ఇప్పటికే ఉన్న పాత సభ్యులతో పాటు, కొత్తగా చేరేందుకు ముందుకు వచ్చే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులను కూడా సభ్యులుగా చేర్చుకుని సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని మామిడి సోమయ్య పిలుపునిచ్చారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !