అష్ణగుర్తిలో సిపిఐ(ఎం) అభ్యర్థి కంచర్ల అనిత గెలుపు.
నేటి గదర్ న్యూస్, వైరా:
మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలలో
వైరా మండలం అష్ణగుర్తి గ్రామంలో సిపిఐ(ఎం) పార్టీ సర్పంచ్ అభ్యర్థి కంచర్ల అనిత 126 మెజారిటీతో విజయం సాధించారు. బిఆర్ఎస్, కాంగ్రెస్, టిడిపి బలపరిచిన సిపిఐ(ఎం) పార్టీ సర్పంచ్ అభ్యర్థి కంచర్ల అనిత సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి యాదాల మల్లేశ్వరితో హోరాహోరీగా జరిగిన పోరులో 126 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. అష్ణగుర్తి గ్రామంలోని 10 వార్డులలో సిపిఐ(ఎం), బిఆర్ఎస్, కాంగ్రెస్ కూటమి అభ్యర్థులు చిత్తూరు జయమ్మ, రేమల్లి శ్రీకాంత్, తాళ్ల సుజాత, కంచర్ల వెంకటమ్మ, కొమ్మోజు బాబు, చిత్తారు నవీన్, గుడిమల్ల శ్రీకాంత్, తాళ్ల సుజాత 8 వార్డులు గెలుచుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు గుమ్మా స్వరూప, వేంసాని వెంకటేశ్వరరావు 2 వార్డులను గెలుచుకున్నారు.
Post Views: 235









