+91 95819 05907

ప్రభుత్వ ఫార్మా రంగ బలోపేతానికి కేంద్రం ఏం చర్యలు తీసుకుంటోంది..?

ప్రభుత్వ ఫార్మా రంగ బలోపేతానికి కేంద్రం ఏం చర్యలు తీసుకుంటోంది..?

* దేశంలో ప్రస్తుతం ఉన్న ఫార్మా పీఎస్ యూలు ఎన్ని?
* వాటి ఆధునికీకరణకు ప్రణాళిక ఉందా..?
* లోక్ సభలో ప్రస్తావించిన ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి
* లిఖిత పూర్వక సమాధానమిచ్చిన కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి.

నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.

న్యూ ఢిల్లీ: దేశంలో ఫార్మా పీఎస్ యూ ( పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్) రంగం బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతోo దని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి లోక్‌సభలో ప్రశ్నించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ… దేశంలో ప్రస్తుతం ఉన్న ఫార్మా పీఎస్‌యూల సంఖ్యను, వాటి ఆధునీకరణకు ఎలాంటి ప్రణాళికలు ఆచరిస్తున్నారో వెల్లడించాలని కోరారు. దీనికి కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
దేశంలో ఐదు ఫార్మా పీఎస్ యూలు..
దేశంలో ప్రముఖంగా ఐదు ఫార్మా పిఎస్ యులు ఉన్నాయని కేంద్ర సహాయ మంత్రి తెలిపారు. ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (ఐ డీ పీ ఎల్)రాజస్థాన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (ఆర్ డీ పీ ఎల్), హిందుస్తాన్ యాంటీబయాటిక్స్ లిమిటెడ్(హెచ్ ఏ ఎల్), బెంగాల్ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్(బీసీపీ ఎల్)కర్ణాటక యాంటీబయాటిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్(కే ఏపీఎల్ ఉన్నట్లు తెలిపారు.
ఫార్మా పీఎస్‌యూల ఆధునీకరణకు కొత్త పథకాలు లేవు..
ఫార్మా పీఎస్‌యూలను ఆధునీకరించి పోటీతత్వాన్ని పెంచేందుకు ప్రత్యేక పునరుజ్జీవన లేదా ఆధునీకరణ పథకాలు ఏవీ ప్రభుత్వం అమలు చేయడం లేదుని కేంద్ర సహాయ మంత్రి పేర్కొన్నారు.
ఐడీపీఎల్ కు నిధులు ఇలా..
ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (ఐ డీపీఎల్) ముగింపు ప్రక్రియ కోసం కేంద్రం గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో భారీ నిధులు కేటాయించిందని వివరించారు. 2022–23 లో ₹2.11 కోట్లు, 2023–24 ₹356.44 కోట్లు, 2024–25 ₹39కోట్లు,2025–26(11.12.2025 వరకు) ₹41.11 కోట్లు మొత్తంగా రూ.397.55 కోట్లు రచించినట్లు తెలిపారు వెచ్చించినట్లు తెలిపారు. కేటాయింపుతో పోలిస్తే 99.52 శాతం ఖర్చు పూర్తయిందని కేంద్రం వివరించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !