+91 95819 05907

స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ జాత‌ర‌కు విస్తృత ఏర్పాట్లు.

స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ జాత‌ర‌కు విస్తృత ఏర్పాట్లు.

శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న నిర్మాణాలు జాతర
నాటికి పూర్తి చేస్తాం

వ‌రంగ‌ల్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి , రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి.

నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతి గాంచిన స‌మ్మ‌క్క‌- సార‌ల‌మ్మజాతర జ‌న‌వ‌రి నెల‌లో ప్రారంభం కానున్న నేపథ్యంలో జాత‌ర కోసం శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామ‌ని ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు.

రాష్ట్ర గిరిజ‌న సంక్షేమ శాఖ మంత్రి ధ‌న‌స‌రి అన‌సూయ ( సీత‌క్క‌), ముఖ్యమంత్రి ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ కె.ఎస్.శ్రీనివాస‌రాజుతో క‌లిసి శుక్ర‌వారం ఎస్.ఎస్. తాడ్వాయి మండలం శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయ గద్దెల పునరుద్ధరణ అభివృద్ధి పనులను, దేవాలయ ప్రాంగణంలోని పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల రాతి నిర్మాణాలను, ఆలయ ప్రాంగణ ఫ్లోరింగ్ పనులను, రాతి స్తంభాల స్థాపన నిర్మాణ పనులను,జంపన్న వాగు వద్ద పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ నిర్మాణ పనులలో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ పనులల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను, గుత్తేదారులను ఆదేశించారు.

తొలుత స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ గ‌ద్దెల వద్ద పూజ‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆలోచ‌న‌ల మేర‌కు మ‌రో వందేళ్ల వ‌ర‌కు భ‌క్తుల‌కు ఎటువంటి అసౌక‌ర్యం లేకుండా చూసే విధంగా నిర్మాణాల‌ను పూర్తి చేయాల‌ని స్ప‌ష్టం చేశారు. మేడారం దేవాలయం అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ జాత‌ర‌కు గిరిజ‌నులు, గిరిజనేత‌రులు దాదాపు కోటి మందికి పైగా హాజ‌ర‌వుతార‌ని, జాత‌ర కోసం 50 కిలోమీట‌ర్ల ప‌రిధిలో భ‌క్తుల కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నామ‌ని, భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా ఏర్పాట్లు చేస్తున్నామ‌ని మేడారం ప్రాంగ‌ణాన్ని మ‌హా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామ‌ని అన్నారు.
ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ , ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్, ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి,పూజారులు, ఆర్ అండ్ బి, ఇంజనీరింగ్ అధికారులు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !