+91 95819 05907

ప్రజా ఉద్యమ నాయకునికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రముఖులు

నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) డిసెంబర్ 12.

ప్రజా ఉద్యమ నాయకుడు మాసాయిపేట యాదన్న అంటే గ్రామస్థాయి నుండి మొదలుకుంటే రాష్ట్రస్థాయి వరకు తెలియని వ్యక్తి అంటూ లేరు. ఎమ్మార్పీఎస్ ఉద్యమ ప్రస్థానంలో తన పాట ఆట లతో తన జాతిని చైతన్య పరుస్తూనే పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఏ పిలుపునిచ్చిన తప్పకుండా విజయవంతం చేసేందుకు తన స్వంత జిల్లాతో పాటు వివిధ జిల్లాలకు ఇన్చార్జిగా వెళ్లి రాష్ట్రాలకు కూడా ఇన్చార్జి వెళ్లిన మాసాయిపేట యాదన్నకు ఉద్యమాలు అంటే ఊపిరి. గద్దర్ అన్న మదిలో యాదన్నకో గుర్తు. ఆ ఉద్యమ స్ఫూర్తితోటే 30 ఏళ్ల ప్రస్తావనంలో మచ్చలేని నాయకునిగా ఎమ్మార్పీఎస్ లో ఎదుగుతూ కృష్ణ మాదిగ బాటలోనే నడుస్తూ ఉద్యమమే ఊపిరిగా ఉంటూ తను ఎన్నో పోరాటాలు చేశాడు. తానుచేసిన సేవలకు గత ప్రభుత్వం అవార్డులతో సహా సత్కరించింది. గత ప్రభుత్వం రచయిత గా కళాకారునిగా సత్కరించింది. యాదన్న మాదిగ అయినా నేటికీ కూడా సాధారణ జీవితమే గడుపుతున్నారు. అది ఒక ఉద్యమకారుని లక్ష్యం. గుండె జబ్బు పిల్లల ఉద్యమం, వృద్ధులు, వితంతులఉద్యమం, రేషన్ కార్డుల కోసం ఉద్యమం, తదితర అనేక ఉద్యమాలు చేశారాయన. సారా పై మొదలైన పాట నేటికీ మూడు పుస్తకాల పాటల రూపం దాల్చడం మన మెదక్ జిల్లా ఉద్యమకారునికి దక్కిన గౌరవం. మాసాయిపేటలో గతంలో జరిగిన రైలు, స్కూల్ బస్సు ప్రమాదంలో మృతి చెందిన చిన్నారుల జ్ఞాపకాలను “రాలిన పూలు” పేరుమీద పాటలు రచించి తల్లిదండ్రుల ఆత్మ గోసను వినిపించాడు. ప్రజాగొంతుక, ప్రజా ఉద్యమ కారులు యాదన్నకు పార్టీలకతీతంగా, సంఘాల కతీతంగా నాయకులు, యువకులు పెద్ద ఎత్తున పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాకు అందరికీ ఆత్మీయుడుగా ఉండే మాసాయిపేట యాదగిరి మాదిగన్నకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !