+91 95819 05907

14న టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా మహాసభ.

తప్పుడు ప్రచారాలు, అక్రమ వసూళ్లపై అడ్‌-హాక్ కమిటీ హెచ్చరిక.

మామిడి సోమయ్యకు సంఘంతో సంబంధం లేదనడం అవివేకం.

జర్నలిస్టుల హక్కులు,
సంఘ బలోపేతంపై కీలక నిర్ణయాలు.

నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఖమ్మం జిల్లా మహాసభ ఈ నెల 14న జిల్లా కేంద్రంలో జరగనున్నట్లు అడ్‌హక్ కమిటీ కన్వీనర్ టి.ఎస్.చక్రవర్తి, కో-కన్వీనర్లు అర్వపల్లి నగేష్, నానబాల రామకృష్ణ, అంతోటి శ్రీనివాస్, వందనపు సామ్రాట్ లు తెలిపారు. ఈ మహాసభను ఫెడరేషన్ వ్యవస్థాపకులు మరియు రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తుండగా, వారికి సంఘంతో సంబంధం లేదని ప్రచారం చేయడం అవివేకమని వారు స్పష్టం చేశారు.
జిల్లా మహాసభల పేరుతో కొందరు వ్యక్తులు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్లు, సమాచారం లభించిందని, టీడబ్ల్యూజేఎఫ్ పేరుతో జరిగే ఏ వసూళ్లనైనా కఠినంగా ఖండిస్తున్నామని, కమిటీ సభ్యులు హెచ్చరించారు. రాష్ట్ర, జిల్లా కమిటీల కాలపరిమితి ముగిసినా పదవుల్లో కొనసాగుతూ, తప్పుడు ప్రకటనలు చేస్తున్న వారిని జర్నలిస్టులు గమనిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ మహాసభలో జిల్లా కమిటీ పునర్వ్యవస్థీకరణ, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్ స్కీమ్, అక్రిడేషన్ కార్డులు, మహిళా జర్నలిస్టుల పరిరక్షణ- హక్కులు వంటి ముఖ్య అంశాలపై చర్చించాలని నిర్ణయించినట్లు తెలిపారు. జిల్లా మహాసభ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో టి.డబ్ల్యూ.జే.ఎఫ్ నాయకులు వంగా పుంగమ గౌడ్, కప్పల మధు, అమరబోయిన ఉపేందర్, కందరబోయిన కృష్ణ, కాసోజు శ్రీధర్, షకీల్, నజీర్, స్వర్ణ, సుధా గాని కరుణాకర్, అఖిల్, ప్రణయ్, హేమంత్, కాశి, శశి, శివకుమార్, అర్జున్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !