+91 95819 05907

అగపేట సర్పంచ్ గా కొత్త యాకన్న గౌడ్ 105 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపు ★★ 7 వార్డులలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల గెలుపు ★తమ్ముడు సర్పంచ్, అక్క వార్డు మెంబర్ గా గెలుపు

అగపేట సర్పంచ్ గా కొత్త యాకన్న గౌడ్ భారీ మెజార్టీతో గెలుపు

★ 7 వార్డులలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల గెలుపు
★తమ్ముడు సర్పంచ్, అక్క వార్డు మెంబర్ గా గెలుపు

నేటి గదర్:దంతాలపల్లి మండలం అగపేట గ్రామ పంచాయితీ సర్పంచ్ గా కొత్త యాకన్న గౌడ్ 105 ఓట్ల భారీ మెజారిటీతో తన సమీప అభ్యర్థి పై గెలుపొందాడు.

★తమ్ముడు సర్పంచ్.. అక్క వార్డు సభ్యురాలు గా గెలుపు

అగపేట సర్పంచ్ గా ఎన్నికైన కొత్త యాకన్న గౌడ్ సోదరి గనగాని నిర్మల ఆరవ వార్డు నుంచి పోటీ చేశారు. ప్రత్యర్థి యసాని పద్మ పై 10 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.ఇలా ఆగపేట చరిత్రలో అక్క తమ్ముళ్లు ఒకే ఎన్నికలు గెలవడం ప్రథమం.

★ఆగపేట పంచాయతీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తా:సర్పంచ్ కొత్త యాకన్న గౌడ్

తనపై పూర్తి విశ్వాసంతో భారీ మెజార్టీతో ఆగపేట సర్పంచిగా తను గెలిపించిన ఓటర్ మహాశయులకు, తనను ఆశీర్వదించిన ఎమ్మెల్యే డా.రామచంద్రనాయక్‌ కు కొత్త యాకన్న గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. డోర్నకల్ ఎమ్మెల్యే డా.రామచంద్రనాయక్‌ ఆశీర్వాదంతో దంతాలపల్లి మండలంలో ఆగపేట పంచాయతీని అభివృద్ధి పథంలో నడిపిస్తానని అన్నారు. తన గెలుపు ఆగపేట ప్రజలగా గెలుపుగా భావిస్తున్నాను అని…. మీరిచ్చిన ఆశీర్వాదంతో ఆగ పేట గ్రామానికి అత్యధిక నిధులు తీసుకురావడానికి కృషి చేస్తానని తెలిపారు.

★ఎమ్మెల్యే డా.రామచంద్రనాయక్‌ ఆశీర్వాదం తో….

పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ఆగపేట గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేయడానికి పలువురు పోటీ పడగా డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ ఆగపేట పంచాయతీకి సంబంధించి కాంగ్రెస్ శ్రేణుల సూచన మేరకు కొత్త యాకన్న గౌడ్ ను తమ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ప్రకటించారు. ప్రచారం సైతం నిర్వహించారు .దీనితో ఆనాడే కొత్త యాకన్న గౌడ్ గెలుపు ఖాయం ఐనది. ఒకానొక దశలో ఏకగ్రీవం కావలసిన ఆగపేట గ్రామపంచాయతీ కొందరి నిర్ణయంతో ఎన్నిక అనివార్యం అయినది. ఎమ్మెల్యే ఆశీర్వాదం ఉండడంతో ఆగపేట గ్రామం ఓటర్లు సర్పంచిగా కొత్త యాకన్నకి పట్టం కట్టారు.

★అగపేట కాంగ్రెస్ శ్రేణులలో జోష్…

తమ అభిమాన లీడర్ కొత్త యాకన్న గౌడ్ భారీ మెజార్టీతో గెలవడంతో ఆగపేట కాంగ్రెస్ శ్రేణులు జోష్ నెలకొంది. ఎన్నిక ఫలితం వెలువడిన అనంతరం తమ సర్పంచ్ అభ్యర్థి కి భారీ మెజార్టీ దక్కడంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. కుంకుమ, రంగులు జల్లుకుంటూ డాన్సులు వేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !