**
నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) డిసెంబర్ 15.
మెదక్ జిల్లా లో గ్రామ పంచాయతీ ఎన్నికల మూడో దశ నిర్వహణలో భాగంగా సోమవారం నాడు తూప్రాన్ ఆర్డిఓఆర్డిఓ జయ చంద్రా రెడ్డి యెల్దుర్తి మరియు మాసాయిపేట మండలాలలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లో ఉన్న ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా రిటర్నింగ్ ఆఫీసర్లు, జోనల్ ఆఫీసర్లు, పంచాయతీ సెక్రటరీలతో సమావేశం నిర్వహించి, ఎన్నికల నిర్వహణ పై అవగాహన కల్పించారు. పోలింగ్ రోజున ఎలాంటి సమస్యలు రాకుండా అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, అధికారులు సిబ్బంది అందరూ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పోలింగ్ సామగ్రి పంపిణీ, సిబ్బంది హాజరు, శాంతిభద్రతల అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని తెలిపారు.గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరగాలంటే ప్రతి ఒక్కరు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని ఆర్డిఓ జయ చంద్రా రెడ్డి పేర్కొన్నారు.









