+91 95819 05907

తెలంగాణలోని వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో పీఎంజీఎస్ వై ద్వారా 1,023 కి. మీ. రోడ్లు.

తెలంగాణలోని వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో పీఎంజీఎస్ వై ద్వారా 1,023 కి. మీ. రోడ్లు.

* రహదారుల సమస్యలపై పార్లమెంట్ లో ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చిన కేంద్రమంత్రి
* నిర్మాణ నాణ్యత పర్యవేక్షణ, నిధుల వివరాలను కోరిన రామసహాయం.

నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.

న్యూ ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలోని వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ( పిఎంజీఎస్ వై ), ఆర్సిపిఎల్ డబ్ల్యూఈఏ ఆధ్వర్యంలో 1,023 కి. మీ. రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాశ్వాన్ వెల్లడించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా మంగళవారం ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి తెలంగాణలోని వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో రహదారుల అనుసంధానంపై లోక్‌సభలో ప్రశ్నించారు. దీనికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాశ్వాన్ లిఖితపూర్వక సమాధానం ఇస్తూ..తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా రహదారి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
తెలంగాణలో 146 రహదారి పనులు, 112 వంతెనల నిర్మాణం… ఆర్‌సీపీఎల్‌డబ్ల్యూఈఏ కింద తెలంగాణకు 146 రహదారి పనులు, 112 వంతెనలు మంజూరు చేసినట్లు కేంద్ర సహాయ మంత్రి వెల్లడించారు. మొత్తం 1,023కిలోమీటర్లు కాగా… రూ.681.15 కోట్ల వ్యయంతో ఇప్పటివరకు 39 రహదారి పనులు (478 కి.మీ.), 50 వంతెనల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. మిగిలిన పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని, 2026 మార్చి నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
*నాణ్యత–నిధులపై కేంద్ర పర్యవేక్షణ*
పిఎంజిఎస్ వై కింద చేపడుతున్న రహదారి పనుల నాణ్యతపై మూడు స్థాయిల పర్యవేక్షణ వ్యవస్థ అమల్లో ఉందని కేంద్రం వివరించింది. ఎన్‌ఆర్‌ఐడీఏ సాంకేతిక పరిశీలన, జాతీయ–రాష్ట్ర స్థాయి నాణ్యత తనిఖీలు, సీఏజీ ఆడిట్‌ల ద్వారా నిర్మాణ నాణ్యతను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. నిధుల సకాల విడుదల కోసం రాష్ట్రాలతో నిరంతర సమీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
*జాతీయస్థాయిలో ఇలా..*
2016లో ప్రారంభించిన ఆర్‌సీపీఎల్‌డబ్ల్యూఈఏ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, బిహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని 44 వామపక్ష ప్రభావిత జిల్లాల్లో రహదారి అనుసంధాన పనులు కొనసాగుతున్నాయని కేంద్ర సహాయ మంత్రి తెలిపారు. ఇప్పటివరకు 12,212 కి.మీ. రహదారులు, 701 వంతెనలు మంజూరయ్యాయని పేర్కొన్నారు. ఇందులో 9,764 కి.మీ. రహదారులు, 528 వంతెనలు పూర్తయ్యాయని, మొత్తం వ్యయం రూ.9,339.74 కోట్లు అని వివరించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !