+91 95819 05907

అశ్వారావుపేటలో గులాబీ జెండా రెపరెపలు: మాజీ ఎమ్మెల్యే మెచ్చాను కలిసిన నూతన సర్పంచ్ లు

అశ్వారావుపేటలో గులాబీ జెండా రెపరెపలు: మాజీ ఎమ్మెల్యే మెచ్చాను కలిసిన నూతన సర్పంచ్లు

​అధికార పార్టీ బెదిరింపులను తట్టుకొని గెలిచాం: కార్యకర్తల కృషితోనే ఈ విజయం -మెచ్చా

​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) డిసెంబర్, 16: అశ్వారావుపేట మండలంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి తన సత్తా చాటింది. రాష్ట్రంలో అధికారంలో లేకపోయినా, స్థానికంగా ఎదురైన అనేక ఒత్తిళ్లు, బెదిరింపులు మరియు దౌర్జన్యాలను తట్టుకొని నిలబడి మండలంలోని 7 కీలక పంచాయతీల్లో గులాబీ జెండాను ఎగురవేసింది. ఈ క్రమంలో, నూతనంగా ఎన్నికైన జమ్మిగూడెం, అనంతారం, వేదాంతపురం, కేసప్పగూడెం, దిబ్బగూడెం మరియు అచ్యుతాపురం పంచాయతీలకు చెందిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు మరియు వార్డు మెంబర్లు ఈరోజు అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావును కలిశారు. దమ్మపేట మండలం, తాటిసుబ్బన్నగూడెం గ్రామంలోని ఆయన నివాసంలో ఈ మర్యాదపూర్వక భేటీ జరిగింది. ఈ సందర్భంగా మెచ్చా నాగేశ్వరరావు నూతనంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, కార్యకర్తలు ప్రాణాలకు తెగించి పనిచేశారని, వారి కష్టార్జితమే ఈ విజయం అని కొనియాడారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో గెలిచిన సర్పంచ్లతో పాటు మండల స్థాయి ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలు మరియు భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !