స్పీకర్ తీర్పు రాజ్యాంగవిరుద్ధం : ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్..
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ తీర్పు రాజ్యాంగవిరుద్ధమని ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.
తీర్పుపై పార్టీ నాయకత్వం న్యాయపోరాటం కొనసాగిస్తుందని, అనర్హత పిటిషన్లను స్పీకర్ వేటి ఆధారంగా డిస్మిస్ చేశారో తెలంగాణ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ సంస్థలను కాంగ్రెస్ ఖూనీ చేస్తోందని, స్పీకర్ నిర్ణయం ఊహించిందేనని వారు మండిపడ్డారు.
Post Views: 21









