+91 95819 05907

మూడవ విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి.

మూడవ విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి.

మూడవ విడత లో 88.84 శాతం పోలింగ్ నమోదు

మూడవ విడతలో 2,16,765 మంది తమ ఓటు హక్కు సద్వినియోగం.

నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.

జిల్లాలో మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ. మూడవ విడతలో భాగంగా ఏడు మండలాల పరిధిలో 168 గ్రామ పంచాయతీలకు, 1372 వార్డులకు నిర్వహించిన పోలింగ్ లో 88.84 శాతం మంది తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారని అన్నారు. ఉదయం 9 గంటల వరకు 27.45 శాతం, 11 గంటలకు 60.84 శాతం, 1 గంట వరకు 86.65 శాతం పోలింగ్ నమోదైందని, ఒంటి గంట వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లకు టోకెన్ అందించి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించామని, వారితో కలిపి మొత్తం ఖమ్మం జిల్లాలో మూడవ విడత 88.84 శాతం పోలింగ్ నమోదైందని అన్నారు. ‌ మూడవ విడత పోలింగ్ నిర్వహించిన ఏన్కూర్ మండలంలో 89.50 శాతం, కల్లూరు మండలంలో 90.72 శాతం, పెనుబల్లి మండలంలో 88.98 శాతం, సత్తుపల్లి మండలంలో 87.36 శాతం, సింగరేణి మండలంలో 87.29 శాతం, తల్లాడ మండలంలో 88.14 శాతం, వేంసూర్ మండలంలో 90.63 శాతం పోలింగ్ నమోదైందని, మొత్తం 2 లక్షల 43 వేల 983 మంది ఓటర్లకు గాను 2 లక్షల 16 వేల 765 మంది ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారని, మొత్తంగా మూడవ విడతలో 88.84 శాతం పోలింగ్ నమోదు అయినట్లు కలెక్టర్ అన్నారు.
అంతకుముందు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తల్లాడ మండలం పినపాక జెడ్పీహెచ్ఎస్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ సరళిని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్ లోని వెబ్ కాస్టింగ్ మానిటరింగ్ సెల్ ద్వారా పోలింగ్ సరళిని పర్యవేక్షణ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట డి.ఆర్.ఓ. ఏ. పద్మశ్రీ, కలెక్టరేట్ ఏఓ కారుమంచి శ్రీనివాసరావు, రెవెన్యూ సిబ్బంది, టెక్నికల్ టీం సభ్యులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !