+91 95819 05907

నేరడలో ఘనంగా కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి:

మండల పరిధిలో నేరడ గ్రామంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు *మంకెన నాగేశ్వరరావు,సర్పంచ్ దూసరి నేతాజీ* తో కలిసి గ్రామంలో గల రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…దేశం స్వాతంత్రం సాధించిన సమయంలో ఆహారం దొరకక ఇబ్బందులు పడుతున్న పరిస్థితిలో హరిత విప్లవం, శ్వేత విప్లవం ద్వారా పంచవర్ష ప్రణాళికలతో దేశానికి కాదు ప్రపంచానికి ఆహార ధాన్యాలు సరఫరా చేసే స్థితికి ఎదిగామని అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమైందని అన్నారు.పేదరిక నిర్మూలన ధ్యేయంగా జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రూపొందిస్తే నేడు బిజెపి ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతున్నదని అన్నారు. దేశ సంపదను, వనరులను బడా పారిశ్రామికవేత్తలకు ధారాదత్తం చేయడమే కేంద్ర ప్రభుత్వ అతి పెద్ద లక్ష్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు నున్నా వీరయ్య, చెవుల తిరుపతిరావు, లక్ష్మీపతి, సుబానీ, మేడ భాస్కర్, ఆలీస్యం శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !