నేటి గదర్ కరకగూడెం: కాంగ్రెస్ పార్టీ స్థాపించి 140 సంవత్సరాలు పూర్తి చేసుకుని 141 వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న,పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అదేశల మేరకు 141వ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన పనిచేస్తుందని అన్నారు. దేశానికి స్వతంత్రం రావడం కోసం కాంగ్రెస్ పార్టీ ముందుండి పోరాడిందని గుర్తు చేశారు.ఈ పార్టీ సముద్రం లాంటిదని ప్రతి కార్యకర్తకు స్వచ్ఛ స్వాతంత్రం కలిగి జాతీయ పార్టీగా గుర్తింపు పొందిందని ఆయన అన్నారు. అలాగే బిజెపి కేంద్ర ప్రభుత్వం పేదల హక్కులపై దాడి చేస్తుందని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పును అంగీకరించమని ఆయన అన్నారు. కోట్లాది గ్రామీణ పేదలకు ఉపాధి హామీ పథకం కల్పించిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం వారి రాజకీయ స్వార్థం కోసం పేరు మార్చడం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంపై వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టడం జరిగిందన్నారు. అధికార అహంకారంతో ప్రజలను మభ్యపెడుతూ ప్రజా వ్యతిరేక విధానాలను అరికట్టాలని ఆయన తెలిపారు. ప్రజల హక్కులను సంక్షేమ పథకాలను కాపాడేందుకు ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో కరకగూడెం సర్పంచ్ పోలెబోయిన. సుజాత, వెంకటాపురం సర్పంచ్ సోలం కేశ్వరావు,కొత్తగూడెం సర్పంచ్, ఎర్రం పోట్టయ్య,తాటిగూడెం ఉపసర్పంచ్ గాందర్ల రామనాధం,మాజీ సర్పంచ్ పొలెబోయిన తిరుపతయ్య,నాగబండి వెంకటేశ్వర్లు, ఎర్ర సురేష్, తదితరులు పాల్గొన్నారు.









