+91 95819 05907

అసెంబ్లీ సమావేశాల వేళ ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్న సర్కార్: అశ్వారావుపేటలో అక్రమ అరెస్టుల కలకలం!

​హామీలపై నిలదీస్తారనే భయంతోనే ముందస్తు నిర్బంధాలా? కాంగ్రెస్ తీరుపై బీఆర్ఎస్ నిప్పులు

​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) డిసెంబర్, 29: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో, అశ్వారావుపేట నియోజకవర్గంలో ముందస్తు అరెస్టులు కలకలం రేపుతున్నాయి. వేదాంతపురం మాజీ సర్పంచ్, ప్రస్తుత వార్డు మెంబర్ సోమిని శివశంకర్ ప్రసాద్ ని ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో పోలీసులు ముందస్తు అరెస్ట్ చేయగా, సోమవారం తెల్లవారుజామున మాల్లాయి గూడెం గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ నారం రాజశేఖర్ ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అసెంబ్లీలో ప్రభుత్వంపై నిరసనలు వ్యక్తమవుతాయనే భయంతోనే ఇలా ప్రశ్నించే గొంతుకలను అక్రమంగా నిర్బంధిస్తున్నారని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు. ప్రజాపాలన అని చెప్పుకుంటూ 420 హామీలను గాలికి వదిలేసిన ఈ ప్రభుత్వం, అరెస్టులతో కాలం గడుపుతోందని ధ్వజమెత్తారు.
​అరెస్టులు చేయడం కాదు దమ్ముంటే ఆడబిడ్డ పెళ్లికి ఇస్తానన్న లక్ష రూపాయలు, తులం బంగారం ఇవ్వాలని, అలాగే వృద్ధులకు రూ. 4వేలు, వికలాంగులకు రూ. 6వేల పెన్షన్, చదువుకునే యువతకు స్కూటీలు, పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని నేతలు డిమాండ్ చేశారు. అసెంబ్లీ సాక్షిగానైనా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై స్పష్టత ఇవ్వాలని, అక్రమ అరెస్టులు మానుకోవాలని హెచ్చరిస్తూ జై కేసీఆర్, జై కేటీఆర్, జై తెలంగాణ అంటూ నినదించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !