శాసనసభ ప్రాంగణంలోని మొదటి సమావేశ మందిరంలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుతో కలిసి సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు గారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ—
అధికార యంత్రాంగం అప్రమత్తంగా, పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు.
శాసన మండలి, శాసనసభలు ప్రజాస్వామ్యానికి ప్రతీకలని పేర్కొంటూ సభ్యుల ప్రశ్నలకు సంతృప్తికర సమాధానాలు ఇవ్వడం సీఎం, మంత్రుల బాధ్యతగా ఉండగా, అధికారులంతా సమగ్ర సమాచారంతో ముందుండాలని సూచించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టసభలు అత్యంత పవిత్రమైనవని, సభలు జరిగే రోజుల్లో అధికారులు పూర్తి నిబద్ధతతో, వేగంగా స్పందిస్తూ ప్రజా ప్రభుత్వం ప్రతిబింబించేలా తమ బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు.
ఉభయ సభల సమాచారాన్ని అధికారికంగా ధ్రువీకరించకుండానే మీడియా ప్రచారం చేయరాదని హెచ్చరించి, పారదర్శకతతో, బాధ్యతతో కార్యాచరణ కొనసాగించాలని ఆదేశించారు.









