+91 95819 05907

రైతులకు యూరియా సరఫరా చేయలేకపోవడం కాంగ్రెస్ పార్టీ అసమర్ధ పాలనకు నిదర్శనం*: లింగాల కమల్ రాజ్

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :

రైతులకు యూరియా సరఫరా చేయలేకపోవటం కాంగ్రెస్ పార్టీ అసమర్ధ పాలనకు నిదర్శనం అని గురువారం చింతకాని తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ మధిర నియోజకవర్గం ఇన్చార్జ్ లింగాల కమల్ రాజ్ అన్నారు ఈ సందర్భంగా కమల్ రాజ్ మాట్లాడుతూ అధికారులు తక్షణమే స్పందించి రైతులకు కొరత లేకుండా యూరియాని సప్లై చేయాలి.గత 9 సంవత్సరాల కెసిఆర్ పాలనలో యూరియా కొరత లేకుండా రైతు షాపుకి ఆటో పంపించి ఇరువులు తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి.వానాకాలం పంటకు సరిపడ ఎరువులు ఇవ్వలేక చెప్పులు లైన్లో పెట్టిచ్చే సందర్భం తీసుకొచ్చింది అని ఆయన మండిపడ్డారు . కాంగ్రెస్ ప్రభుత్వం రెండో పంట కూడా ఎరువులు సప్లై చేయలేకపోవడం కాంగ్రెస్ అసమర్ధ పాలనకు నిదర్శనం.పరిపాలనలో పట్టులేని వారిని తొందరపడి ముఖ్యమంత్రి గా చేసుకుంటే ఇలాంటి కష్టాలే పడాల్సి వస్తుంది అని రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ. రైతులకు యూరియా సరిపడా సరఫరా చేయలేకపోవడం కాంగ్రెస్ పార్టీ చేతగాని తనానికి నిదర్శనమన్నారు గతంలో కెసిఆర్ పాలనలో రైతులు ఇబ్బందులు లేకుండా వ్యవసాయం చేసుకున్నారని అన్నారు, ఇప్పటికైనా మేల్కొని రైతులకు సరిపడ యూరియాని సరఫరా చేయాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి బొడ్డు వెంకట రామారావు, మాజీ ఎంపీపీ గురజాల హనుమంతరావు, రైతు నాయకులు మంకెన రమేష్, మండల నాయకులు గడ్డం శ్రీను, వేముల నరసయ్య, పొనుగోతటి రత్నాకర్,బండి రామారావు, వకాయల సత్యం, కోల్లి బాబు,పిన్నెల్లి శ్రీనివాస్, తిమ్మినేని పాలెం సర్పంచ్ ప్రభూదానం, కొమాట్లగూడెం సర్పంచ్ పరిశుద్దరావు,తిరుములపురం సర్పంచ్ వీరబాబు, కోపూరి నవీన్, నాదెండ్ల సురేష్, నాగిలి గొండ మాజీ సర్పంచ్ సురేష్, కొలేటి రాధ తదితర పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !