నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) డిసెంబర్ 31.
మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో నీటి సమస్య పరిష్కరించేందుకు నూతనంగా ఏర్పడ్డ గ్రామ పాలకవర్గం గ్రామంలో ఉన్న సమస్యలను మొదటగా మాసాయిపేట లో నీటి సమస్యను గుర్తించి బోర్లను వేస్తున్నారు. నూతనంగా రెండు బోర్లను వేశారు. మాసాయిపేట లోని ఒకటో వార్డులో బోర్ వేయించగా అలాగే రెండు పాత బోర్లను రిప్రెస్సింగ్ చేసే పనులను చేపట్టారు. మాసాయిపేటలో తాగునీటి సమస్య లేకుండా చూసేందుకు బోర్లను వేస్తున్నట్లు సర్పంచ్ వీరన్న గారి కృష్ణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాసాయిపేట ఉపసర్పంచ్ పసుల వెంకటేష్, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు గుండారం శ్రీనివాస్, వార్డు సభ్యులు దొంతి లలిత, పెరమండ్ల రమేష్ పాల్గొన్నారు.
Post Views: 78









