+91 95819 05907

వ్యవసాయ విద్యార్థులే రేపటి దేశ భాగ్యవిధాతలు: జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

అశ్వారావుపేటలో అట్టహాసంగా ప్రారంభమైన విశ్వవిద్యాలయ స్థాయి క్రీడా పోటీలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి, 03: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని వ్యవసాయ కళాశాలలో శనివారం నుండి నాలుగు రోజుల పాటు జరగనున్న విశ్వవిద్యాలయ స్థాయి ఆటల పోటీలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రీడా సంబరానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. గౌరవ అతిథిగా విశ్వవిద్యాలయ స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ డాక్టర్ చల్లా వేణుగోపాల రెడ్డి పాల్గొనగా, యూనివర్సిటీ అబ్సర్వర్‌గా డాక్టర్ ఎస్. మధుసూధన రెడ్డి వ్యవహరించారు.
ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ, వ్యవసాయం అనేది సమాజంలో అత్యంత శక్తివంతమైన మరియు గౌరవప్రదమైన వృత్తి అని కొనియాడారు. సాంకేతిక పరిజ్ఞానం తోడుగా రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సగటు రైతు ఒక ఐఏఎస్ తో సమానమని, ఇక్కడ ఐఏఎస్ అంటే ‘ఇండియన్ అగ్రికల్చరల్ సర్వీస్’ అని ఆయన కొత్త అర్థాన్ని ఇస్తూ విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఇటువంటి గొప్ప వృత్తికి సేవ చేసే అవకాశం లభించిన విద్యార్థులు, అధ్యాపకులు నిజంగా అదృష్టవంతులని ఆయన పేర్కొన్నారు. ఆటల్లో గెలుపోటముల కంటే భాగస్వామ్యం ముఖ్యమని, ఈ క్రీడలను కేవలం పోటీగా మాత్రమే కాకుండా ఒకరి నుండి ఒకరు నేర్చుకునే అభ్యసన ప్రక్రియలా భావించాలని విద్యార్థులకు సూచించారు. మరో అతిథి డాక్టర్ చల్లా వేణుగోపాల రెడ్డి మాట్లాడుతూ, క్రీడల వల్ల విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం మరియు క్రీడా స్ఫూర్తి పెరుగుతాయని తెలిపారు. విశ్వవిద్యాలయ స్థాయి క్రీడా ప్రాచుర్యాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత నేటి యువతపై ఉందని ఆయన గుర్తు చేశారు. ఈ క్రీడా సంబరంతో కళాశాలలో పండుగ వాతావరణం ముందే వచ్చిందని యూనివర్సిటీ అబ్సర్వర్ డాక్టర్ మధుసూధన రెడ్డి పేర్కొంటూ, పోటీల నిర్వహణపై నివేదికను సమర్పించారు. విశ్వవిద్యాలయ పరిధిలోని 13 కళాశాలల నుండి సుమారు 467 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత కుమార్ మరియు ఆఫీసర్ ఇంచార్జి ఆఫ్ స్టూడెంట్స్ యాక్టివిటీస్ డాక్టర్ ఎం. రామ్ ప్రసాద్ దగ్గరుండి సమన్వయపరిచారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !