ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 155 మంది మహిళలకు ఇందిరమ్మ చీరలను, అలాగే ఉపాధి కూలీల సౌకర్యార్థం 62 యూనిట్ల పనిముట్లను (పలుగులు, పారలు, తట్టలు) అందజేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ రాంబాబు, ఆత్మ కమిటీ చైర్మన్ వీరభద్రరావు, ఎక్స్ సొసైటీ చైర్మన్ సత్యనారాయణ, సీనియర్ నాయుకులు జూపల్లి రమేష్ మరియు వెలుగు ఆఫీస్ సీ.సీ. వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. సర్పంచ్ కుంజా శ్రీను, పంచాయతీ కార్యదర్శి తేజ, ఉప సర్పంచ్ కేరం మంగ, గ్రామదీపిక తిరుపతమ్మ మరియు వార్డు సభ్యులు కోర్స లక్ష్మి, నారం నాగరత్నం, పూనెం రాములు, నారం కనక, నారం లక్ష్మి, నారం సుధాకర్, కుర్సం కృష్ణమూర్తి ఈ పంపిణీలో భాగస్వాములయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మొడియం కృష్ణవేణి, బీఆర్ఎస్ నాయకులు నారం దిలీప్ కుమార్, అప్పలరాజు, రమేష్తో పాటు గ్రామ పెద్దలు వగ్గేల పోలారావు, పూనెం రామలక్ష్మయ్య, పూనెం ప్రవీణ్, కోర్స చలమారావు, వగ్గేల వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.









