+91 95819 05907

అశ్వారావుపేట అభివృద్ధికి రూ.15 కోట్లు: మౌలిక వసతులే లక్ష్యంగా మంత్రి పొంగులేటి భూమిపూజ

​పట్టణ రూపురేఖలు మారుస్తాం.. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎంపీ రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణతో కలిసి మంత్రి ప్రకటన

నేటి గద్దర్ న్యూస్,​అశ్వారావుపేట, జనవరి, 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మున్సిపాలిటీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం భారీ కేటాయింపులు చేపట్టిందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం అశ్వారావుపేటలో రూ.15 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే జారె ఆదినారాయణలతో కలిసి ఆయన ఘనంగా భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా పట్టణాలు, పల్లెల మధ్య వ్యత్యాసం లేకుండా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని, అందులో భాగంగానే అశ్వారావుపేటలో అంతర్గత రహదారులు, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ, స్వచ్ఛమైన తాగునీరు, కమ్యూనిటీ హాళ్లు మరియు పార్కుల అభివృద్ధి వంటి పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజా అవసరాలను గుర్తించి ప్రణాళికాబద్ధంగా నిధులు విడుదల చేస్తున్నామని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా నేతలు పునరుద్ఘాటించారు. కార్యక్రమ అనంతరం నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లను మంత్రి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, కార్పొరేషన్ చైర్మన్ మువ్వ విజయ్ బాబు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !