+91 95819 05907

ప్రాణానికి రక్షణ ‘హెల్మెట్’.. రోడ్డు భద్రతపై అశ్వారావుపేట పోలీసుల ప్రత్యేక అవగాహన!

​అరైవ్ అలైవ్ క్యాంపెయిన్: ఊట్లపల్లిలో గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించిన ఎస్సై యయాతి రాజు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి, 13: తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా చేపట్టిన అరైవ్ అలైవ్ క్యాంపెయిన్‌లో భాగంగా అశ్వారావుపేట పోలీసులు ముమ్మరంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశానుసారం మంగళవారం మండలంలోని ఊట్లపల్లి గ్రామంలో ఎస్సై టి యయాతి రాజు ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించడం, కారులో ప్రయాణించే వారు సీటు బెల్టు పెట్టుకోవడం తప్పనిసరి అని, ఇవి ప్రాణరక్షక కవచాల్లా పనిచేస్తాయని పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అలాగే మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల జరిగే ఘోర ప్రమాదాలను గతంలో జరిగిన సంఘటనలతో ఉదహరిస్తూ ఆయన గ్రామస్తులకు వివరించారు. మీ ప్రాణం మీ కుటుంబానికి ఎంతో విలువైనదని, ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా ఇళ్లకు చేరాలని ఆయన కోరారు. అనంతరం రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తామని గ్రామస్తులందరితో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పోలీస్ సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !