+91 95819 05907

పోలింగ్ కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉండాలి సీపీఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం

పోలింగ్ కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉండాలి

సీపీఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం

నేటి గదర్ న్యూస్, వైరా:
వైరా మున్సిపాలిటీ పరిధిలోని పోలింగ్ కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉండాలని సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం అన్నారు. వైరా మున్సిపాలిటీ పరిధిలో పోలింగ్ కేంద్రాలు చేర్పులు, మార్పులపై మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్, వైరా పట్టణ కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు, పట్టణ నాయకులు కొంగర సుధాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు వైరా మున్సిపాలిటీలోని 20 వార్డులకు సంబంధించిన పోలింగ్ కేంద్రాల ప్రతిపాదనలను సమగ్రంగా పరిశీలించారు. అందులో 5, 6, 9 వార్డులకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలు ప్రజలకు దూరంగా ఉండేలా ప్రతిపాదించబడినట్లు గుర్తించి, అలా చేస్తే ఓటర్లకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రత్యేకించి 5, 6, వార్డుల పరిధిలో సుందరయ్య నగర్, ఇందిరమ్మ కాలనీ, రాజశేఖర్ నగర్ ప్రాంత ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా అక్కడే పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేని చోట, ప్రభుత్వ అనుమతి పొందిన ప్రైవేటు విద్యాసంస్థల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.
సీపీఎం ప్రతిపాదనలపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ గురులింగం మాట్లాడుతూ 5, 6 వార్డుల పోలింగ్ కేంద్రాల విషయాన్ని ఎన్నికల కమిషన్‌, జిల్లా కలెక్టర్‌కు నివేదిక పంపించి, పోలింగ్ కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉండేలా ఏర్పాటుకు కృషి చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో అఖిల పక్ష రాజకీయ పార్టీల నాయకులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !