+91 95819 05907

దుర్గమ్మ గట్టు అభివృద్ధిపై పాలకుల నిర్లక్ష్యం: పరమశివుడిని కూడా మోసం చేస్తారా?

​ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు గాలికి.. భక్తులకు కష్టాలే మిగిలే! నిలదీసిన బీజేపీ నాయకులు.

నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి ) జనవరి, 22: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం, గుర్వాయిగూడెం గ్రామ పరిధిలోని చారిత్రక, ఆధ్యాత్మిక క్షేత్రమైన దుర్గమ్మ గట్టుపై వెలసిన స్వయంభూ శివాలయం నేడు పాలకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారిందని బీజేపీ నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి తీవ్రంగా విమర్శించారు. గురువారం దుర్గమ్మ గట్టును సందర్శించిన బీజేపీ నాయకుల బృందం అక్కడి దుస్థితిని పరిశీలించి, స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసారు. గత ఏడాది ఉత్సవాల సమయంలో ఆలయాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తామని ఇచ్చిన హామీని ఎమ్మెల్యే విస్మరించారని, కనీసం భక్తులు నడిచి వెళ్లడానికి దారి కూడా లేక పెద్ద పెద్ద బండరాళ్లు, కంపచెట్లతో భక్తులు నానా ఇబ్బందులు పడుతున్నారని వారు ధ్వజమెత్తారు. నాయకుల పొలాలకు తారు రోడ్లు వేసుకుంటున్న ప్రజాప్రతినిధులు, వేల ఏళ్ల ప్రాశస్త్యం కలిగిన పుణ్యక్షేత్రానికి కనీస సౌకర్యాలు కల్పించకపోవడం శోచనీయమని, ఇది సాక్షాత్తూ ఆ పరమశివుడిని మోసం చేయడమేనని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చే అసాధ్యమైన హామీల బాటలోనే ఎమ్మెల్యే హామీలు కూడా ఉన్నాయని, త్వరలో రానున్న మహాశివరాత్రి లోపు యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట బీజేపీ మండల అధ్యక్షులు పల్లపు వెంకటేశ్వరరావు, జిల్లా నాయకులు గూడ ముత్యాలరావు, కారం రత్నకుమారి, పల్లపు శిరీష తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !