+91 95819 05907

రోడ్డుపై అప్రమత్తత.. ప్రాణాలకు రక్షణ కవచం!

​యువత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి: ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి, 22: జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం 2026 సందర్భంగా తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అశ్వారావుపేటలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు భారీ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అశ్వారావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ, రోడ్డు భద్రత అనేది కేవలం ప్రభుత్వం లేదా పోలీస్ శాఖ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి కనీస కర్తవ్యమని ఉద్ఘాటించారు. 18 ఏళ్లలోపు వారు, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, సరదా కోసం చేసే పనులు యువత ఉజ్వల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, అతివేగం మరియు మద్యం సేవించి వాహనం నడపడం మృత్యువును ఆహ్వానించడమేనని హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండి, లైసెన్స్ లేకుండా వారికి వాహనాలు ఇవ్వకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ సతీష్ కుమార్, సీఐ నాగరాజు, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ నిర్మల, ఎస్సైలు సాయి కిషోర్ రెడ్డి, యయాతి రాజు, డాక్టర్ విజయ్ తదితరులు పాల్గొని రోడ్డు ప్రమాదాల నివారణపై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. చివరగా, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం తరఫున ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించి తమ ప్రాణాలను, ఎదుటివారి ప్రాణాలను కాపాడాలని పిలుపునిచ్చారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !