నేటి గదర్ న్యూస్,చింతకాని ప్రతినిధి :
మత్కేపల్లి నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శిగా నామాల శ్రీనివాసరావు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మత్కేపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన నామాల శ్రీనివాసరావు కి చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు శుభాకాంక్షలు తెలియజేస్తూ, రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.ఈ సమావేశంలో ఖమ్మం జిల్లా మార్కెటింగ్ అధికారి ఎం.ఏ. అలీమ్ పాల్గొని నామాల శ్రీనివాసరావు కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం వ్యవసాయ మర్కెట్ ఉద్యోగస్తులు మద్దినేని రామకృష్ణ ,కందగట్ల రామకృష్ణ పాల్గున్నారు అనంతరం వ్యవసాయ మర్కెట్ స్థలాని పరిశీలించిన అధికారులు మరియు మర్కెట్ కమిటి చైర్మన్ ,డైరెక్టర్లు ..నూతన కార్యదర్శి బాధ్యతలు స్వీకరించడంతో మత్కేపల్లి నూతన వ్యవసాయ మార్కెట్ మరింత త్వరగా అందుబాటులోకి వస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.









