+91 95819 05907

అసెంబ్లీ సాక్షిగా కార్మికుల గళం వినిపిస్తా -ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

​దమ్మపేటలో పారిశుధ్య కార్మికులతో కలిసి రోడ్లు ఊడ్చిన ఎమ్మెల్యే.. సమస్యల పరిష్కారానికి హామీ!

నేటి గద్దర్ న్యూస్, ​దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి, 23: దమ్మపేట మండల పరిధిలోని మందలపల్లి సెంటర్‌లో శుక్రవారం ఒక వినూత్న దృశ్యం ఆవిష్కృతమైంది. గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికులు వీధులను శుభ్రం చేస్తున్న క్రమంలో అక్కడికి చేరుకున్న అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ స్వయంగా పారిశుధ్య పనుల్లో నిమగ్నమయ్యారు. కార్మికులతో కలిసి స్వయంగా చీపురు పట్టి రోడ్ల వెంట ఉన్న చెత్తను తొలగిస్తూ పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండను, వానను లెక్కచేయకుండా ప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం శ్రమిస్తున్న పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. గ్రామాల పరిశుభ్రతలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కార్మికులతో కొద్దిసేపు ముచ్చటించిన ఎమ్మెల్యే, వారి పనిలో ఎదురవుతున్న ఇబ్బందులను, వ్యక్తిగత సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి న్యాయపరమైన డిమాండ్లను త్వరలోనే అసెంబ్లీ వేదికగా ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా భరోసా కల్పించారు. ప్రజాప్రతినిధి హోదాలో ఉండి కూడా సామాన్య కార్మికులతో కలిసి పని చేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !