+91 95819 05907

స్కూల్ అసిస్టెంట్ సస్పెన్షన్

*🔶ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖాధికారి*

*🔷ఖమ్మం డీఈవో కార్యాలయంలో ఇద్దరికి మెమోలు*

*🍥విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండటం, ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలకు ప్రమోషన్లు చేయ డంతో పాటు పాఠశాల సమయంలో రీల్స్ చేయడంతో పలుమార్లు ఉన్నతా ధికారులు హెచ్చరించారు. అయినా ఆ ఉపాధ్యాయురాలు తన తీరు మార్చుకోకపోవడంతో గురువారం జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైని ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. దీనికి సంబంధించిన వివరాలివీ.. ఖమ్మం మామిళ్లగుడెం ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న బానోత్ గౌతమి కొన్ని నెలలుగా నగరంలోని ఓ ప్రైవేటు పాఠశాల అడ్మిషన్లకు సంబంధించిన ప్రమోషన్లు చేస్తూ.. తన ప్రభుత్వ పాఠశాల విధులను నిర్లక్ష్యం చేస్తోంది. అలాగే పాఠశాల సమయంలో రీల్స్ చేస్తూ సమయం వృథా చేస్తోందనే అంశాలపై గతంలో పలు మార్లు హెచ్చరించినా తన తీరు మార్చుకోకపోవడంతో గురువారం ఆమెను సస్పెండ్ చేశామని డీఈవో తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు కేవలం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తోడ్పాడు అందించాలని, విధినిర్వ హణలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే డీఈవో కార్యాలయంలో మరో ఇద్దరు సిబ్బందికి మెమోలు జారీ చేశారు. ఒకరు సమయం పాటించకుండా మధ్యాహ్నమే ఇంటికి వెళ్లడం, మరొకరు ఫైల్స్ ఆలస్యం చేస్తూ డీఈవో టేబుల్ పై ఉన్నాయంటూ అబద్ధాలు చెబుతుండ టంతో మెమో జారీ చేసినట్లు డీఈవో తెలిపారు. కార్యాలయ సిబ్బంది కార్యాలయ సమయపాలన పాటించాలని, అంకితభావంతో పని చేసి ఫైల్స్ అందించాలని డీఈవో సిబ్బందికి సూచించారు. లేదంటే శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని వారిని హెచ్చరించారు.*

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !