పరిటాల రవన్న కు ఘన నివాళి
నేటి గదర్ న్యూస్,ఖమ్మం టౌన్:
ఖమ్మం జిల్లా తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పరిటాల రవీంద్ర 21వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు . ఈ సందర్భంగా హడ్ హక్ కమిటీ సభ్యులు కేతినేని హరీష్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి క్యాబినెట్ మంత్రిగా పనిచేశారని . తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో ఆంధ్రప్రదేశ్ లో అనేక సంక్షేమ పథకాలు చంద్రబాబు తో కలిసి పనిచేసిన ముఖ్యులు లో ఒకరని వారు చేసిన సేవలను గురించి కొనియాడారు . వీరితో పాటు మాజి మున్సిపల్ కౌన్సిలర్ పెనుగొండ ఉపేందర్ రావు , మేకల సత్యవతి , ఎస్వి రమణ , చల్లగుండ్ల రమేష్ , కొలికొండ మురళి , కొల్లుపూర్ణ ధామాల శివ , మద్దినేని శ్రీనివాస్ , చౌడవరపు శ్రీనివాస్ రావు , చిర్రా వెంకన్న తదితరులు ఉన్నారు .









