+91 95819 05907

గెలుపు గుర్రాలకే టికెట్లు:మంత్రి పొంగులేటి

టికెట్ల కేటాయింపులో పూర్తి పారదర్శకత :మంత్రి పొంగులేటి

మున్సిపల్ ఎన్నికల్లో ‘క్లీన్ స్వీప్’ లక్ష్యంగా పనిచేయాలి

పార్టీ గెలుపే పరమావధిగా అందరూ సమన్వయంతో సాగాలి

సర్వే ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

ఇల్లందు నేతలతో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం

ఖమ్మం టౌన్,నేటి గదర్:
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఇల్లందు మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి మున్సిపల్ ముఖ్య నేతలు, ఆశావహులతో మంత్రి సమావేశం నిర్వహించారు.
ఎన్నికల ప్రక్రియ అతి త్వరలోనే ప్రారంభం కానుందని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. “వచ్చే నెల మధ్య నాటికి ఎన్నికల ప్రక్రియ అంతా పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. సమయం తక్కువగా ఉన్నందున పార్టీ శ్రేణులు ఇప్పుడే క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు.

టికెట్ల కేటాయింపులో పూర్తి పారదర్శకత పాటిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి వార్డులో ప్రజల ఆమోదం, అభ్యర్థి యోగ్యత ఆధారంగా శాస్త్రీయంగా సర్వే నిర్వహించి, ఆ నివేదికల ప్రకారమే బి-ఫామ్ ఇస్తామని వెల్లడించారు. పార్టీ పట్ల విధేయత, ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్నవారికే ప్రాధాన్యత ఉంటుందని, ఎలాంటి ప్రలోభాలకు తావులేకుండా అర్హులకే సీట్లు దక్కుతాయని భరోసా ఇచ్చారు. పార్టీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని మంత్రి కోరారు.

“ఒకే వార్డులో ఎక్కువ మంది అభ్యర్థులు ఉండటం సహజం. కానీ బి-ఫామ్ ఒకరికే దక్కుతుంది. టికెట్ రాని మిత్రులు ఆందోళన చెందవద్దు. పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరినీ గుర్తించి, భవిష్యత్తులో కో-ఆప్షన్ సభ్యులుగా లేదా ప్రభుత్వంలోని ఇతర పదవుల ద్వారా వారి రాజకీయ గౌరవానికి భంగం కలగకుండా చూసే బాధ్యత నాదే” అని హామీ ఇచ్చారు. పార్టీ లైన్ దాటకుండా, ప్రతి ఒక్కరూ అధికారిక అభ్యర్థి గెలుపు కోసం సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

“ఇల్లందు అభివృద్ధికి ఇప్పటికే కోట్ల రూపాయల నిధులను కేటాయించాం. మున్సిపాలిటీలోని 24 వార్డుల్లో మన అభ్యర్థులను గెలిపిస్తే, భవిష్యత్తులో మరింత భారీగా నిధులు తీసుకువచ్చి ఇల్లందు రూపురేఖలు మారుస్తా” అని మంత్రి వాగ్దానం చేశారు. తనను నమ్ముకున్న కార్యకర్తలను కుటుంబ సభ్యుల్లా కాపాడుకుంటానని, అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని కోరారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !