*నేటి గదర్ న్యూస్ గుండాల*, మండల కేంద్రంలోని పోస్టల్ కార్యాలయంలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీపీఎం గంగాధరి రవీందర్ జాతీయ జెండాను ఎగరవేసి జాతీయ గీతాన్ని సిబ్బందితో కలిసి ఆలపించారు. ప్రతి సంవత్సరం గణతంత్ర వేడుకలను పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని అన్ని పోస్టల్ కార్యాలయాల్లో నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోస్టల్ సిబ్బంది వేముల అనిల్, పూనెం సమ్మయ్య, కె సుధాకర్, మోడెం సత్యం, వాస రాజు, శివ శంకర్, రాజేష్, గ్రామస్తులు బొబ్బిలి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు
Post Views: 133









