*నేటి గదర్ న్యూస్ గుండాల*, ఏజెన్సీలో ఉన్న వలసవాదులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నైతం బాలు అన్నారు. మైదాన ప్రాంతం నుండి గిరిజనేతర్లు ఏజెన్సీలోకి వచ్చి అక్రమంగా భూములు కొని బవల అంతస్తులు నిర్మిస్తున్నారని అన్నారు. వలస వాదులకు ఓటు హక్కు కల్పించడం ద్వార గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు ఇప్పటికైనా వలస వాదులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పునెం రమణ బాబు, పార్టీ సర్పంచులు ఈసాల సురేష్, కల్తీ రాధ, బట్టు కనకరాజు, సుధాకర్, సుదర్శన్, శేఖర్, తదితరులు పాల్గొన్నారు
Post Views: 11









