**
*నేటి గదర్ న్యూస్ గుండాల*, మండల కేంద్రంలో ఉన్న మోదుగులకుంట ఇతర చెరువుల శిఖం భూముల ఆక్రమణ పై చట్టపరమైన చర్యలను తీసుకొని తక్షణమే భూములను స్వాధీనం చేసుకోవాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సోమవారం తాసిల్దార్ కు వినతి పత్రాన్ని సమర్పించారు అనంతరం ఆదివాసి సంఘాల నాయకులు మాట్లాడుతూ మోదుగులకుంట శిఖం భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని వాటిని కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉందని అన్నారు. లేనివేడల ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పునేం శ్రీను, చింత వెంకటేశ్వర్లు, వజ్జ ఎర్రయ్య, ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు విసి దొర పాల్గొన్నారు
Post Views: 12








