సీఎం కప్ క్రీడా పోటీలను ప్రారంభించిన ఎంపిడిఓ వెంకటేశ్వరరావు.
పినపాక, ఫిబ్రవరి13:
గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు పినపాక మండల సీఎం కప్ క్రీడల చైర్మన్, ఎంపిడిఓ వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం ఎల్చిరెడ్డిపల్లి ఆశ్రమ పాఠశాలలో మండల స్థాయి క్రీడా పోటీల ప్రారంభోత్సవ కార్యక్రామానికి ఆయన ముఖ్య అతిథి గా హజరై క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ యువతకు క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించడంతో పాటు వారికి సరైన వేదిక కల్పించడమే సీఎం కప్ ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ పోటీల ద్వారా ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
క్రీడలు వలన క్రమశిక్షణ, సమన్వయం వంటి విలువలు అలవడతాయని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది యువత పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గొంది గోపాలకృష్ణ, ఎంఈఓ నాగయ్య, సర్పంచ్ లు కొర్సా విజయలక్ష్మి, తోలెం స్వప్న, పడిగ, క్రిష్ణవేణి, సుతారి సింధూజ, మద్దెల సమ్మయ్య, వాగబోయిన చందర్ రావు, పీడి వీరన్న, స్థానిక అధికారులు, క్రీడాకారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.








