యువ నేత యుగంధర్ కు బర్త్ డే శుభాకాంక్షలు.
షాది ఖానా డైరెక్టర్ షేక్. ఖదీర్ ( చైర్మన్ )
నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్:
ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత , సీనియర్ నాయకులు , రాష్ట్రమంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు , యువ నేత , డాక్టర్
తుమ్మల యుగంధర్ బుధవారం జన్మదినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా 38 వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు,ఖమ్మం షాది ఖానా డైరెక్టర్ షేక్. ఖదీర్ ( ఖమ్మం షాది ఖానా చైర్మన్ ) మంగళవారం ఒక ప్రకటన లో శుభాకాంక్షలు ప్రకటించారు. ఇలాంటి జన్మదినోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ యువనేత డాక్టర్ తుమ్మల యుగంధర్ భావి జీవితం ,అష్టా ఐశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో ,ఆయురారోగ్యాలతో గడపాలని అభిలాషించారు. యువ నేత యుగంధర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని షాది ఖానా డైరెక్టర్లు , కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా వివిధ రకాల కార్యక్రమాలు తలపెట్టాలని పిలుపునిచ్చారు. వాడవాడాలలో యువనేత జన్మదినోత్సవాన్ని ప్రజల మధ్య ఘనంగా తల పెట్టాలని షేక్. ఖదీర్ సూచించారు.








