+91 95819 05907

ప్రజాక్షేత్రంలో మాజీ ఎమ్మెల్యే ‘కట్టెపుల్లల’ కసరత్తు: వినూత్న శైలిలో తాటి వెంకటేశ్వర్లు ప్రచారం!

ప్రజాక్షేత్రంలో మాజీ ఎమ్మెల్యే ‘కట్టెపుల్లల’ కసరత్తు: వినూత్న శైలిలో తాటి వెంకటేశ్వర్లు ప్రచారం!

​వార్డు అభ్యర్ధుల గెలుపు కోసం నడుం బిగించిన మాజీ ట్రైకార్ చైర్మన్.. సామాన్యులతో మమేకమవుతూ ఓట్ల వేట.

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) ఫిబ్రవరి, 03: అశ్వారావుపేట మున్సిపాలిటీ ఎన్నికల వేళ రాజకీయ సందడి పతాక స్థాయికి చేరింది, ఇందులో భాగంగా 5వ వార్డు అభ్యర్థి ఎండి రెహానా బేగం విజయమే లక్ష్యంగా అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మరియు మాజీ ట్రైకార్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు రంగంలోకి దిగి వినూత్న రీతిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. నియోజకవర్గ ప్రజలతో ఎప్పుడూ సన్నిహితంగా ఉండే ఆయన, ప్రచారంలో భాగంగా శనివారం వార్డులోని ప్రతి ఇంటినీ సందర్శిస్తూ, ఒక సామాన్యుడిలా మారిపోయి ప్రజలను ఆశ్చర్యపరిచారు. ఒక ఇంటి వద్ద మహిళలు కట్టెపుల్లలు కొడుతుండటం గమనించిన వెంకటేశ్వర్లు, స్వయంగా గొడ్డలి పట్టుకుని కట్టెలు కొడుతూ వారితో ముచ్చటించి, వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. పదవుల కంటే ప్రజా సేవయే మిన్న అని చాటుతూ, రెహానా బేగంకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. అగ్రనేత స్థాయి వ్యక్తి తమ మధ్యకు వచ్చి సామాన్యుడిలా కలిసిపోవడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు, ఈ వినూత్న ప్రచారం ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

క్షతగాత్రున్ని కాపాడిన మాజీ ఎమ్మెల్యే రేగా ★ రేగా మానవత్వం పై అభినందనల వెల్లువ

*మనసున్న మహారాజు మాజీ ఎమ్మెల్యే రేగా* *మరో మారు మానవత్వం చాటుకున్న రేగ కాంతారావు* *నేటి గదర్ న్యూస్ గుండాల*, మనసున్న మహారాజు రేగ కాంతారావు అని మరో మారు నిరూపించుకున్నారు కొత్తగూడెం నుండి

Read More »

వైరా మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం..మాజీ మంత్రి పువ్వాడ

నేటి గదర్, ఖమ్మం: బిఆర్ఎస్,సిపిఎం,సిపిఐ అభ్యర్థులను గెలిపించండి.. ఖమ్మం ఇంచార్జుల మరియు పోటీ చేసిన కౌన్సిలర్ అభ్యర్థులకు పలు సూచనలు చేసిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.. వైరా మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్

Read More »

మృత్యు రహదారి★ ఆదమరిస్తే అనంత లోకాలకి ★ ఆర్ అండ్ బి అధికారులు దృష్టి సారించాలి అంటున్న వాహనదారులు

*మృత్యు మార్గము* *ఆదమరిస్తే అనంత లోకాలకి* *ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోని ఆర్ అండ్ బి అధికారులు* *నేటి గదర్ న్యూస్ గుండాల*,గుండాల నుండి మణుగూరు వెళ్లే ప్రధాన రహదారి సాయనపల్లి గ్రామ సమీపంలో రహదారి

Read More »

ఇంగ్లీషు భాషా పరిజ్ఞానం పెరిగేలా ఎవ్రీ చైల్డ్ రీడ్స్ అమలు : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఇంగ్లీషు భాషా పరిజ్ఞానం పెరిగేలా ఎవ్రీ చైల్డ్ రీడ్స్ అమలు : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి నేటి గదర్ న్యూస్,వైరా: పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం మెరుగుపర్చి, రీడింగ్ స్కిల్స్

Read More »

యువ నేత యుగంధర్ కు బర్త్ డే శుభాకాంక్షలు.

యువ నేత యుగంధర్ కు బర్త్ డే శుభాకాంక్షలు. షాది ఖానా డైరెక్టర్ షేక్. ఖదీర్ ( చైర్మన్ ) నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్: ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత ,

Read More »

గేటు రేలకాయల పల్లిలో నేటి నుంచి మినీ జాతర ప్రారంభోత్సవం

*2 రోజుల పాటు సాగనున్న వన జాతర పూజా కార్యక్రమాల*… కారేపల్లి నేటి గద్దర్ ప్రతినిధి సుమంత్: గిరిజనుల ఆరాధ్య దైవమైన సమ్మక్క సారలమ్మ దేవతలు కొలువుతీరిన మినీ జాతర కారేపల్లి మండలం గేటు

Read More »

 Don't Miss this News !