కాంగ్రెస్ నర్సాపూర్ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి.
నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 6.
మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో అంగన్వాడి సెంటర్లు సరిపోవడం లేదని గతంలో ఇబ్బందులు ఎదురవుతున్న విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుత మాసాయిపేట సర్పంచ్ మెదక్ జిల్లా సర్పంచ్ ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ వీరన్నగారి కృష్ణారెడ్డి స్థల దాతలతో సంప్రదింపులు జరిపి వారి సహకారంతో మాసాయిపేట్ లో బైనీరు చెరువు దగ్గర వీరన్న గారి ముత్తిరెడ్డి వారసులు అంగన్వాడి సెంటర్ కు స్థలం ఇవ్వగా మరో అంగన్వాడి కేంద్రం కోసం సాయిబాబా గుడి దగ్గరగా కీర్తిశేషులు అంజి రెడ్డి గారి కేశవరెడ్డి వారసులు అంగన్వాడి సెంటర్ కు స్థలం ఇవ్వడం చాలా సంతోషమని సర్పంచ్ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని అడగనే స్కూళ్లకు స్థలం ఇచ్చిన దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ నర్సాపూర్ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి పాల్గొన్నారు. తన సొంత గ్రామంలో 2వ మరియు 5వ అంగన్వాడీ రెండు భవనాలను మంజూరు చేయించినట్లు తెలిపారు. ఒక్కో భవనానికి 12 లక్షలు చొప్పున మంజూరైనట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాసాయిపేట మండల సర్పంచ్ లు మరియు పాలక మండలి సభ్యులు కాంగ్రెస్ కార్యకర్తలు వివిధ గ్రామాలకు సంబంధించిన సర్పంచులు వార్డ్ మెంబర్లు భారీగా తరలివచ్చారు.









