+91 95819 05907

కర్ల రాజేష్ మృతదేహానికి రీ పోస్టు మార్టం చేయడానికి పోలీసులు ఎందుకు జంకుతున్నారు ?◆పోలీసుల మీద మా వాదనలు తప్పైతే మా మీద కేసు పెట్టండి.◆పద్మశ్రీ ‘ మంద కృష్ణ మాదిగ.

పోలీసుల మీద మా వాదనలు తప్పైతే మా మీద కేసు పెట్టండి.

మా ప్రశ్నలపై పోలీసుల మౌనం వారి నేరాన్ని స్పష్టంగా బయటపెడుతుంది.

మరియమ్మ లాకప్ డెత్ విషయంలో కేసీఆర్ స్పందించినంత మెరుగ్గా రాజేష్ లాకప్ డెత్ విషయంలో రేవంత్ రెడ్డి స్పందించ లేదు.

త్వరలోనే రేవంత్ కు లేఖ రాస్తాం..అపాయింట్ మెంట్ కోరుతాం.

వారం రోజుల్లో హైదరాబాద్ లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తాం.

– ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ‘ పద్మశ్రీ ‘ మంద కృష్ణ మాదిగ.

నేటి గదర్ హైదరాబాద్ ఫిబ్రవరి 9.

పోలీసుల చిత్రహింసలు వల్ల ప్రాణాలు కోల్పోయిన దళిత యువకుడు కర్ల రాజేష్ మృతదేహానికి రీ పోస్టు మార్టం చేయడానికి పోలీసు శాఖ ఎందుకు జంకుతుందని , రీ పోస్టు మార్టం చేయాలని మేము లిఖిత పూర్వకంగా పిర్యాదు చేసినా, అలాగే మరోవైపు జాతీయ ఎస్సీ కమిషన్ కూడా డీజీపీ , చీఫ్ సెక్రటరీ కి రీ పోస్టు మార్టం చేయాలని ఆదేశించినా, ఆ ఆదేశాలు ఎందుకు అమలు చేయడం లేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ‘పద్మశ్రీ ‘ మంద కృష్ణ మాదిగ ప్రశ్నించారు .

సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ

” కర్ల రాజేష్ మృతికి పోలీసులే కారణమని దాదాపు తొంభై రోజులుగా మేము మాట్లాడుతున్నా దీనిపై పోలీసు శాఖ నుండి నేటికీ జవాబు గానీ,వివరణ గానీ , ఖండన గానీ లేవని అన్నారు.
మా వాదన తప్పైతే మాపై పోలీసులు కేసులు పెట్టవచ్చు,చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు కదా ఎందుకు మౌనంగా ఉంటున్నారు అని అన్నారు.మొన్న మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ పోలీస్ కమిషన్ సజ్జనార్ మీద ఆరోపణలు చేస్తే వెంటనే నోటీసులు పంపారు కదా మరి తొంభై రోజులుగా మేము కర్ల రాజేష్ పోలిసుల వల్లనే చనిపోయడని మాట్లాడుతుంటే మా మీద ఎందుకు కేసులు పెట్టడం లేదని అన్నారు.ఎందుకు మౌనంగా ఉంటున్నారు.దీనిని బట్టి పోలీసుల మౌనమే వారి నేరాన్ని స్పష్టంగా బయటపెడుతుందని అన్నారు.
రాజేష్ మరణానికి ప్రధాన కారకులు పోలీసులే అని రుజువు చేయడానికి అన్ని ఆధారాలు ఉన్నాయని అన్నారు.అందుకే రీ పోస్టు మార్టం చేయడానికి ముందుకు రావడం లేదని అన్నారు.పోలీసులు నిజాయితీపరులైతే రీ పోస్టుమార్టం చేయడానికి భయమెందుకు ? అని అన్నారు.
రీ పోస్టు మార్టం చేస్తే అసలు కారణాలు బయటకు వస్తాయని భయపడుతున్నారని అన్నారు.
కర్ల రాజేష్ పోలీసుల చిత్రహింసల వల్ల చనిపోలేదని గుండె పోటుతో చనిపోయాడని నమ్మించడానికి పోస్టుమార్టం రిపోర్టు తయారుచేయించుకోవడానికి కుట్రలు చేస్తున్నారని అన్నారు.
అందుకే సూర్యాపేట ఎస్పీ రీ పోస్టు మార్టంకు అడ్డుపడుతున్నారని అన్నారు.ఎస్పీని అడ్డుపెట్టుకొని రీ పోస్టుమార్టం జరగకుండా నేరస్థులను కాపాడడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు చూస్తున్నారని అన్నారు.ఈ విషయమై జాతీయ ఎస్సీ కమిషన్ డీజీపీకి, చీఫ్ సెక్రటరీ కి నోటీసులు పంపి రీ పోస్టు మార్టం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తే , 50 రోజులు దాటినా ఆ ఆదేశాలు ఎందుకు అమలు చేయలేదు అని ప్రశ్నించారు.జాతీయ ఎస్సీ కమిషన్ నిబంధనలను పోలీసు శాఖ తుంగలోకి తొక్కింది అని అన్నారు.కొంతమంది పోలీసు అధికారుల వల్ల పోలీసు శాఖ ప్రతిష్ట దిగజారుతుందని అన్నారు.
తక్షణమే సూర్యాపేట ఎస్పీని బదిలీ చేయాలని ,ఆయన అక్కడ ఉంటే కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తారని అన్నారు.రాజేష్ లాకప్ డెత్ లో చట్టవిరుద్ధమైన కస్టడీ, చట్టవిరుద్ధమైన చిత్రహింసలు ఇప్పటికే రుజువైనయని, ఇక రీ పోస్టు మార్టం ద్వారా ఇంకా అనేక ఆధారాలు బయటకు వస్తాయని,దోషులకు చట్టపరమైన శిక్షలు పడేంత వరకు ఈ విషయాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. గతంలో మరియమ్మ లాకప్ డెత్ ఘటనలో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల మీద చేయి వేస్తే ఊరుకోమని పోలీసులను హెచ్చరించి వెంటనే ఎస్ఐ కానిస్టేబుల్స్ ని డిస్మిస్ చేశారని, అలాగే 35 లక్షల రూపాయల ఎక్స్ గ్రేశియా ఇవ్వడంతో పాటు కుటుంబ సభ్యులకు ఉద్యోగం, ఇల్లు ఇచ్చి పది రోజుల్లోనే సమస్య పరిష్కారం చేశాడని అన్నారు.కానీ కర్ల రాజేష్ లాకప్ డెత్ జరిగి నేటికి మూడు నెలలు కావస్తున్నా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటికీ కనీసం నోరు కూడా మెదపలేదని విమర్శించారు. హోం శాఖ తన పరిదిలో ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి మౌనంగా ఉండడం దారుణం అని అన్నారు. లాకప్ డెత్ ఘటన పై స్పందించే విషయంలో కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి మధ్య ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా ఉందని అన్నారు.
అలాగే గత డీజీపీ మహేందర్ రెడ్డి మరియమ్మ కుటుంబాన్ని పరామర్శించి ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూస్తామని ప్రకటన చేశాడు.కానీ నేటి డీజీపీ శివదర్ రెడ్డి కనీసం కర్ల రాజేష్ కుటుంబం వైపు కన్నెత్తి చూడలేదు,పైగా కనీసం జరిగిన తప్పును సరిదిద్దడానికి ప్రయత్నం కూడా చేయలేదు అని అన్నారు. ఇలాంటి చర్యల వల్ల పోలీసు శాఖ గౌరవం దెబ్బతింటుందని అన్నారు.కర్ల రాజేష్ లాకప్ డెత్ ఘటన మీద ప్రతిపక్ష పార్టీలు సరైన పాత్ర పోషించలేదని అన్నారు.నేటి ప్రతిపక్షాల పాత్ర ప్రజల పక్షాన లేదని అన్నారు.మరియమ్మ లాకప్ డెత్ ఘటన మీద స్పందించినట్లుగా నేడు రాజేష్ లాకప్ డెత్ ఘటన మీద స్పందించ లేదని అన్నారు .త్వరలోనే హైదరాబాద్ లో ఎమ్మార్పీఎస్ అధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని అన్నారు.అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. ఫిబ్రవరి 28 న చలో సూర్యాపేట పేరుతో ప్రజా ఆగ్రహ మహాసభను నిర్వహిస్తామని అన్నారు. ఈ సభకు అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులను ఆహ్వానిస్తామని అన్నరు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

సిపిఎం–బిఆర్ఎస్–సిపిఐ కూటమి అభ్యర్థులను గెలిపించాలి*

*సిపిఎం–బిఆర్ఎస్–సిపిఐ కూటమి అభ్యర్థులను గెలిపించాలి* *6, 9 వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం* నేటి గదర్ న్యూస్,వైరా: వైరా మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి, వార్డులలో ప్రజలు

Read More »

ఆర్థిక అంశాలలో అప్రమత్తంగా ఉండాలి :  జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఆర్థిక అంశాలలో అప్రమత్తంగా ఉండాలి :  జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి నేటి గదర్ న్యూస్,ఖమ్మం: ఆర్థిక అంశాలలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. జిల్లా కలెక్టర్, కలెక్టరేట్ లోని సమావేశ

Read More »

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు పకడ్బందీ ఏర్పాట్లు : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు పకడ్బందీ ఏర్పాట్లు : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి నేటి గదర్ న్యూస్, ఖమ్మం: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పకడ్బందీగా జరిగేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్

Read More »

కర్ల రాజేష్ మృతదేహానికి రీ పోస్టు మార్టం చేయడానికి పోలీసులు ఎందుకు జంకుతున్నారు ?◆పోలీసుల మీద మా వాదనలు తప్పైతే మా మీద కేసు పెట్టండి.◆పద్మశ్రీ ‘ మంద కృష్ణ మాదిగ.

పోలీసుల మీద మా వాదనలు తప్పైతే మా మీద కేసు పెట్టండి. మా ప్రశ్నలపై పోలీసుల మౌనం వారి నేరాన్ని స్పష్టంగా బయటపెడుతుంది. మరియమ్మ లాకప్ డెత్ విషయంలో కేసీఆర్ స్పందించినంత మెరుగ్గా రాజేష్

Read More »

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

 Don't Miss this News !