+91 95819 05907

సిపిఎం–బిఆర్ఎస్–సిపిఐ కూటమి అభ్యర్థులను గెలిపించాలి*

*సిపిఎం–బిఆర్ఎస్–సిపిఐ కూటమి అభ్యర్థులను గెలిపించాలి*

*6, 9 వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం*

నేటి గదర్ న్యూస్,వైరా:
వైరా మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి, వార్డులలో ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యల పరిష్కారం కోసం సిపిఎం–సిపిఐ–బిఆర్ఎస్ కూటమి అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం ఓటర్లను విజ్ఞప్తి చేశారు.
ప్రచారానికి చివరి రోజున వైరా మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు సిపిఎం కౌన్సిలర్ అభ్యర్థి మాదినేని రజిని,9వ వార్డు సిపిఎం కౌన్సిలర్ అభ్యర్థి గుడిమెట్ల రజిత గెలిపించాలని ఆయన ఇంటింటి విస్తృత ప్రచారం నిర్వహించారు. 6వ వార్డు పరిధిలోని సుందరయ్య నగర్, 9వ వార్డు పరిధిలోని రాజశేఖర్ నగర్ ప్రాంతాల్లో ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా భూక్యా వీరభద్రం మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 25 నెలలు గడిచినా వైరా మున్సిపాలిటీలో సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని విమర్శించారు. ముఖ్యంగా రాజశేఖర్ నగర్‌లో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మున్సిపాలిటీ పాలకులు దీనిపై నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు.
ప్రజల పక్షాన నిలబడి స్థానిక సమస్యల పరిష్కారం కోసం సిపిఎం నిరంతరం ఉద్యమాలు నిర్వహించిందని గుర్తు చేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే నిజాయితీ గల ప్రతినిధులుగా సిపిఎం–సిపిఐ–బిఆర్ఎస్ కూటమి అభ్యర్థులు మాత్రమే ఉంటారని పేర్కొంటూ, వారిని గెలిపించాలని కోరారు.
ఈ ప్రచార కార్యక్రమంలో 9వ వార్డు అభ్యర్థి గుడిమెట్ల రజిత, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పారుపల్లి ఝాన్సీ, మెరుగు రమణ,సిపిఎం, బిఆర్ఎస్, టిడిపి నాయకులు బాణాల శ్రీనివాసరావు, కె. నరేంద్ర, మచ్చా నరేంద్ర, కొండబోయిన ఉమావతి, వజ్జా రామారావు, తాతా పద్మ, బాదావత్ శ్రీనివాస్ , బానోతు బన్సీలాల్ , తాళ్లపల్లి విజయ, బాజోజి రమణ, తోట కృష్ణవేణి, కంసాని మల్లిక, శ్రీదేవి, సుంకర భాస్కర్, నరేష్, అప్పారావు, ప్రసాద్, బోడపూడి వీరభద్రం, బాణాల వెంకట్రావమ్మ ,సుబ్రహ్మణ్యం , షేక్ బిలాల్ షేక్ మజీద్ బి రెహనా, రుద్రాక్షల వెంకటాచారి, నారికొండ అమరేందర్, ముత్తమాల విజయ రావు బాణాల కృష్ణమ చారి, యరమల మాధవ రెడ్డి,పగిడిపల్లి కాటయ్య ,సూరయ్య, తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

సిపిఎం–బిఆర్ఎస్–సిపిఐ కూటమి అభ్యర్థులను గెలిపించాలి*

*సిపిఎం–బిఆర్ఎస్–సిపిఐ కూటమి అభ్యర్థులను గెలిపించాలి* *6, 9 వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం* నేటి గదర్ న్యూస్,వైరా: వైరా మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి, వార్డులలో ప్రజలు

Read More »

ఆర్థిక అంశాలలో అప్రమత్తంగా ఉండాలి :  జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఆర్థిక అంశాలలో అప్రమత్తంగా ఉండాలి :  జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి నేటి గదర్ న్యూస్,ఖమ్మం: ఆర్థిక అంశాలలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. జిల్లా కలెక్టర్, కలెక్టరేట్ లోని సమావేశ

Read More »

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు పకడ్బందీ ఏర్పాట్లు : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు పకడ్బందీ ఏర్పాట్లు : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి నేటి గదర్ న్యూస్, ఖమ్మం: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పకడ్బందీగా జరిగేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్

Read More »

కర్ల రాజేష్ మృతదేహానికి రీ పోస్టు మార్టం చేయడానికి పోలీసులు ఎందుకు జంకుతున్నారు ?◆పోలీసుల మీద మా వాదనలు తప్పైతే మా మీద కేసు పెట్టండి.◆పద్మశ్రీ ‘ మంద కృష్ణ మాదిగ.

పోలీసుల మీద మా వాదనలు తప్పైతే మా మీద కేసు పెట్టండి. మా ప్రశ్నలపై పోలీసుల మౌనం వారి నేరాన్ని స్పష్టంగా బయటపెడుతుంది. మరియమ్మ లాకప్ డెత్ విషయంలో కేసీఆర్ స్పందించినంత మెరుగ్గా రాజేష్

Read More »

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

 Don't Miss this News !