+91 95819 05907

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు పకడ్బందీ ఏర్పాట్లు : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు పకడ్బందీ ఏర్పాట్లు : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం:
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పకడ్బందీగా జరిగేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.
మునిసిపల్ ఎన్నికలపై సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ రాణి కుముదిని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, సాధారణ ఎన్నికల పరిశీలకులు పవన్ కుమార్ లతో కలిసి పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ఖమ్మం జిల్లా పరిధిలో 5 మున్సిపాలిటీల్లో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. ఎన్నికల పరిశీలకుల సమక్షంలో మూడవ ర్యాండమైజేషన్ పూర్తిచేసి పోలింగ్ బృందాలను ఫైనల్ చేసామని, పోలింగ్ సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించామని అన్నారు. ప్రతి మున్సిపాలిటీ పరిధిలో డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను పకడ్బందీగా ఏర్పాటు చేశామని, అక్కడ పోలింగ్ సిబ్బందికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు. కౌంటింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియ కూడా పూర్తయినట్లు, కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ అందించామని, కౌంటింగ్ హాల్స్ నందు అవసరమైన ఏర్పాట్లు కల్పించామని కలెక్టర్ తెలిపారు.
100 శాతం పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామని, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ విజయవంతంగా పూర్తి చేసామని, పోలింగ్ ముగిసిన వెంటనే సిబ్బందికి అవసరమైన టిఏ, డిఏ ల చెల్లింపులు జరిపేలా వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.ప్రతి మున్సిపాలిటీకి ఒక ఇంచార్జి అధికారి ఎన్నికల నిర్వహణ కోసం కేటాయించా మన్నారు. పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుంటూ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు భద్రత ఏర్పాటు చేశామని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా పటిష్టంగా చర్యలు తీసుకున్నామని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ముజాహిద్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

సిపిఎం–బిఆర్ఎస్–సిపిఐ కూటమి అభ్యర్థులను గెలిపించాలి*

*సిపిఎం–బిఆర్ఎస్–సిపిఐ కూటమి అభ్యర్థులను గెలిపించాలి* *6, 9 వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం* నేటి గదర్ న్యూస్,వైరా: వైరా మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి, వార్డులలో ప్రజలు

Read More »

ఆర్థిక అంశాలలో అప్రమత్తంగా ఉండాలి :  జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఆర్థిక అంశాలలో అప్రమత్తంగా ఉండాలి :  జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి నేటి గదర్ న్యూస్,ఖమ్మం: ఆర్థిక అంశాలలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. జిల్లా కలెక్టర్, కలెక్టరేట్ లోని సమావేశ

Read More »

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు పకడ్బందీ ఏర్పాట్లు : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు పకడ్బందీ ఏర్పాట్లు : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి నేటి గదర్ న్యూస్, ఖమ్మం: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పకడ్బందీగా జరిగేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్

Read More »

కర్ల రాజేష్ మృతదేహానికి రీ పోస్టు మార్టం చేయడానికి పోలీసులు ఎందుకు జంకుతున్నారు ?◆పోలీసుల మీద మా వాదనలు తప్పైతే మా మీద కేసు పెట్టండి.◆పద్మశ్రీ ‘ మంద కృష్ణ మాదిగ.

పోలీసుల మీద మా వాదనలు తప్పైతే మా మీద కేసు పెట్టండి. మా ప్రశ్నలపై పోలీసుల మౌనం వారి నేరాన్ని స్పష్టంగా బయటపెడుతుంది. మరియమ్మ లాకప్ డెత్ విషయంలో కేసీఆర్ స్పందించినంత మెరుగ్గా రాజేష్

Read More »

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

 Don't Miss this News !