సీఎంఆర్ఎఫ్ చెక్ అందజేసిన ఎమ్మెల్యే పాయం
పినపాక
మణుగూరులోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన ఆర్థిక సహాయం చెక్కును ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు లబ్ధిదారునికి అందజేశారు.
పినపాక మండలం జనంపేట గ్రామానికి చెందిన బలుగురి నాగేశ్వరరావు అనారోగ్యం కారణంగా అత్యవసర వైద్య చికిత్సల కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు చేసిన చెక్కును అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అనారోగ్యం మరియు అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందిస్తున్న ఆర్థిక సహాయం ఎంతో ఉపయుక్తమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబం ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేలా తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు.
లబ్ధిదారు కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి కి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, అవసరమైన వారికి ప్రభుత్వ సహాయం సమయానికి అందేలా అధికారులు చురుకుగా పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.








