రేగా సైన్యం వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం
పినపాక
పినపాక మండలం పొట్లపల్లి గ్రామంలో రేగా సైన్యం ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు హాజరై టోర్నమెంట్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలకు ప్రోత్సాహం ఇవ్వడం ఎంతో అవసరమని, యువత క్రీడల ద్వారా శారీరకంగా దృఢంగా, మానసికంగా బలంగా ఎదగాలని ఆకాంక్షించారు. క్రీడాస్ఫూర్తితో పోటీల్లో పాల్గొని గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు సత్తిబాబు, దాట్ల వాసుబాబు,రవి శేఖర్ వర్మ, గుమ్మడి గాంధీ,నాయకులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Post Views: 5








