రంజాన్ కు ముస్తాబైన అశ్వాపురం జామా మసీద్…
— రంగురంగుల విద్యుత్ కాంతులతో మసీదుకు శోభాయానం.
అశ్వాపురం:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండల కేంద్రంలోని జామా మసీదును గురువారం ప్రారంభమయ్యే రంజాన్ మాసంను పురస్కరించుకొని ముందస్తుగా రంగురంగుల విద్యుత్ కాంతులతో జామా మసీద్ కమిటీ ఆధ్వర్యంలో ముస్తాబు చేశారు. అత్యంత పవిత్రమైన ఈ రంజాన్ మాసంలో కఠోరమైన ఉపవాస దీక్ష చేపడుతూ ముస్లిం సోదరులు ప్రతిరోజు ఉదయాన్నే లేచి సహరి చేసి సాయంత్రం ఇఫ్తార్ వరకు కనీసం మంచినీరు కూడా ముట్టుకోకుండా, ఉమ్మి కూడా మింగకుండా అత్యంత కఠోరంగా ఉపవాస దీక్షను చేపడతారు. రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులు విరివిరిగా దానధర్మాలు తోటి వారికి సహాయ సహకారాలు చేస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో 5 పూటల నమాజ్ చేస్తూ దేవుని సన్నిధిలో( మసీదులో) ఎక్కువ సమయం గడిపి ఆ అల్లాను స్మరించుకుంటారు. తమ కోరికలను తీర్చాలంటూ వేడుకుంటారు. తాము చేసిన తప్పులను మన్నించి తమను సద్ మార్గంలో నడపాలని ప్రార్థిస్తారు. రంజాన్ మాస ప్రారంభం సందర్భంగా ముస్లింలందరూ ఒకరినొకరు ఆ లింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో… అశ్వాపురం జామా మసీద్ కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలు మరియు మత గురువులు పాల్గొన్నారు.








